-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థుల విద్యా ప్రగతి, ప్రవర్తన, హాజరు మరియు శారీరక–మానసిక అభివృద్ధి పై ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా చర్చించేందుకు జూలై 10న జిల్లావ్యాప్తంగా తల్లిదండ్రుల సమావేశాలు (Parent-Teacher Meetings – PTMs) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 976 ప్రభుత్వ పాఠశాలలు, 568 ప్రైవేట్ పాఠశాలలు, మరియు 126 ఇంటర్మీడియట్ కళాశాలల్లో ఒకేసారి PTMలు నిర్వహించనున్నట్లు తెలియ చేశారు. విద్యార్థుల ప్రగతిపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చి, విద్యా మార్గదర్శకాలను సూచించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, గ్రామ సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అలాగే ప్రభుత్వ అధికారులు హాజరై విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తమ అభిప్రాయాలను పంచుకోనున్నట్లూ తెలియ చేశారు. తల్లిదండ్రులంతా తప్పకుండా హాజరై తమ పిల్లల భవిష్యత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు.
Prajavartha Online Telugu News