రీ సర్వేపై ఆర్డీవో కార్యాలయంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి ఆర్డీవో కార్యాలయంలో రీ సర్వే పనుల పురోగతిపై బుధవారం సాయంత్రం డివిజన్ స్థాయి తహశీల్దార్లు, సర్వే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో ఆర్. కృష్ణనాయక్, జిల్లా సర్వే శాఖ సహాయ సంచాలకులు బి. లక్ష్మీనారాయణ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో కృష్ణ నాయక్, ఏ డి సర్వే లక్ష్మీ నారాయణ లు మాట్లాడుతూ, నవంబర్ చివరి నాటికి ప్రభుత్వ భూములు, గ్రామ సరిహద్దుల నిర్ధారణకు సంబంధించిన రీ సర్వే పనులు పూర్తిచేయాలన్నారు. జూలై నెలాఖరులోగా 16 పైలట్ గ్రామాలకు సంబంధించి 13 నోటిఫికేషన్‌లు జారీ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీసీఎల్ఏ కమిషనర్ ప్రతి రోజూ ప్రగతి పై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను 100 శాతం పరిష్కరించాలి, జాయింట్ ఎల్‌పీఎమ్‌(LPM) అభ్యర్థనల విషయంలో పరిష్కారం కల్పించి, వాటిని ఆన్‌లైన్‌లో అనుసంధానించాలన్నారు. విస్తీర్ణంలో తేడాలు ఉన్న అర్జీలను ప్రాధాన్యతగా పరిగణించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే మోహన్ రావు, డివిజన్ స్థాయి తహశీల్దార్లు, ఆర్‌ఎస్‌డీటీలు (RSDT) పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *