Breaking News

మాధవ్ నేతృత్వంలో బీజేపీ బలోపేతం

-ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీ .వీ .ఎన్ మాధవ్ నేతృత్వంలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీ. వీ. ఎన్ మాధవ్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో కొత్తపేట శ్రీనివాస్ మహల్ సెంటర్ లో ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకలలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని బీజేపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఏపీలో బీజేపీ బలోపేతంపై, ప్రణాళికతో కూడిన రోడ్ మ్యాప్ ను మాధవ్ సిద్ధం చేశారని తెలిపారు. పార్టీలో క్రమశిక్షణతో , కష్టపడి పనిచేసి ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని చేపట్టే స్థాయికి మాధవ్ ఎదిగారన్నారు.
ఆయన నేతృత్వంలో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని అడ్డురి శ్రీరామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, గుడివాడ నరేంద్ర రాఘవ,కొత్తపేట మండల అధ్యక్షులు మోరం సత్యసాయి ప్రసాద్, కె హరినారాయణ, అడ్డూరి ఆకాష్,మహదేవ్ సురేష్,పస్పులేటి శివ,నవీన్, ప్రసాద్, కాకర శ్రీనివాసరావు, పోలవరపు దుర్గారావు, పైలా సురేష్, అవ్వారు బుల్లబ్బాయి, దేవిన హరిప్రసాద్, పచ్చిపులుసు శివప్రసాద్, యలకల అనిల్, పగడాల కృష్ణ, బెన్నా భక్తుల సోమేశ్వరరావు, కందుల సుబ్రహ్మణ్యేశ్వరరావు, నాళం ఠాకూర్, నున్న కృష్ణ,వేరుకొండ ఉమాకాంత్, కుంభ రమేష్, బెవరమురళి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *