ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాష్టమి సందర్బంగా శనివారం సాయంత్రం ఇంద్రకీలాద్రి పై ఉట్టి కొట్టే వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ కృష్ణ జననం గురించి ధార్మిక ఉపన్యాసం అనంతరం రాజ గోపురం ముందు ఉట్టి పాత్ర వద్ద స్థానా చార్య ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం జరిగింది. తదుపరి ఆలయ కార్యనిర్వహణాధికారి శీనానాయక్ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొని, ఉట్టి కొట్టారు.ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ మన పండుగలు ఆధ్యాత్మిక, ధార్మిక సంప్రదాయములకు ప్రతీక గా నిలుస్తున్నాయని, మన ఆచారవ్యవహారములలో ఆరోగ్యం, ఆధ్యాత్మికతలు ఇమిడి ఉన్నాయని అన్నారు.భవిష్యత్ తరాలకు సనాతన సంప్రదాయములు తెలిసేలా ఇటువంటి వేడుకలు నిర్వహించే బాధ్యత దేవాలయముల మీద ఉందని శీనా నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో పలువురు దేవాలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News