‘భక్తులకు మెరుగైన వైద్యసేవల ఏర్పాటు…’

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గా మల్లేశ్వరుల దర్శనం కోసం ఇంద్రకీలాద్రి కి విచ్చేసే భక్తులకు ఏదైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడితే తక్షణమే స్పందించి వైద్య సేవలు అందేలా దేవస్థానం వైద్య కేంద్రానికి జవ సత్వాలు కల్పిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి. కె. శీనానాయక్ పేర్కొన్నారు. శనివారం ఉదయం దేవస్థానం ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, రికార్డులు పరిశీలించారు. వైద్యులు పూర్తి స్థాయిలో లేకపోవడం, రోగుల వివరాల నమోదు లో లోపాలు,అవసరమైన మందులు లోటు గమనించి, అర్హత గలిగిన నర్సింగ్ సిబ్బంది కేటాయించినా ఇంకా ఆరోగ్య కేంద్రం పరిస్థితి లో మార్పురాకపోవడం పై ఈవో అసహనం వ్యక్తం చేశారు. ఇరుకు గదిలో ఆరోగ్యకేంద్రం నిర్వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తగినంత గాలి వెలుతురు వచ్చేలా విశాలంగా మార్పు చేయాలని ఇంజనీరింగ్ సిబ్బంది ని ఆదేశించారు. ఈ తనిఖీ లో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ సి హెచ్ రంగారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి. రాంబాబు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *