గౌతు లచ్చన్న పోరాట పటిమ మార్గదర్శకం

– లచ్చన్న కుటుంబంతో మా కుటుంబానికి అనుబంధం
– వైసిపి హయాంలో బీసీలను పట్టించుకోలేదు
– గౌతు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించే ఆలోచన చేయలేదు
– అధికారికంగా నిర్వహించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే
– బిసి జాతి బిడ్డలుగా మనందరికీ ఇది గర్వకారణం
– ఆదరణ పథకాన్ని కూడా అటకెక్కించిన వైసిపి ప్రభుత్వం
– బీసీలకు అండగా ఎల్లప్పుడూ కూటమి ప్రభుత్వం
– నగరంలో దామాషా ప్రకారం బిసిలకు పదవులు ఇస్తున్నాం
– గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రసిద్ధ స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు గౌతు లచ్చన్న పోరాట పటిమ మనకే కాదు, భవిష్యత్తు తరాలకు కూడా మార్గదర్శకం అని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అన్నారు. గౌతు లచ్చన్న జయంతి సందర్బంగా కూటమి ఆధ్వర్యంలో అధికారికంగా స్థానిక వై జంక్షన్‌ లోని గౌతు లచ్చన్న విగ్రహం దగ్గర జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసు పాల్గొని పూలమాల వేసి నివాళులర్పిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ తరువాత ‘‘సర్దార్‌’’ అనే గౌరవ బిరుదు పొందిన ఏకైక తెలుగు నాయకుడు లచ్చన్న అని అన్నారు. గత ఐదేళ్లూ వైసిపి పాలనలో బీసీలను పట్టించుకోలేదు సరికదా, ప్రజా నాయకుడైన గౌతు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలన్న కనీస ఆలోచన కూడా వారికి రాలేదని ఆయన ఎద్దేవా చేసారు. కూటమి ప్రభుత్వం లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి, జీవో కూడా ఇచ్చిందని ఆయన అన్నారు.
గౌతు లచ్చన్న కుటుంబానికి, మా కుటుంబ సభ్యులకు సన్నిహిత సంబంధం ఉందని ఆయన ప్రస్తావించారు. లచ్చన్నతో మా మామయ్య… కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు, కలిసి పని చేశారని, వారిద్దరికీ అత్యంత సన్నిహిత సంబంధం ఉందని ఎమ్మెల్యే వాసు చెప్పారు. ఇక లచ్చన్న కుమారుడు గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజీ తో మా నాన్న ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా ఉన్నపుడు కల్సి పనిచేశారని , ఇప్పుడు నేను, లచ్చన్న మనవరాలు గౌతు శిరీష శాసన సభలో ఉన్నామని ఎమ్మెల్యే వాసు గుర్తుచేశారు. మూడు తరాలుగా ఒకే కుటుంబంతో ఇలా అనుబంధం ఉండడం ఆనందంగా ఉందన్నారు. గీత కులాలకు ఆరాధ్యదైవం అయిన గౌతు లచ్చన్న జయంతిని అధికారికంగా నిర్వహించడం జరుగుతోందని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు.ఇది బిసి జాతి బిడ్డలుగా మనందరికీ గర్వకారణమన్నారు. కూటమి ప్రభుత్వానికి ఆయన పట్ల, బీసీ కులాల పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు. మహనీయులు అందరివారని అయన అన్నారు. మేయర్ గా తన తల్లి వీరరాఘవమ్మ ఉన్నపుడు ఇక్కడ విగ్రహ ఏర్పాటులో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ అందరినీ కలుపుకుని ఈ విగ్రహం పెట్టించడానికి సహకారం అందించారని, మహనీయుల పట్ల అందరూ ఐక్యంగా పని చేయాలన్నదానికి ఇది తార్కాణమని ఎమ్మెల్యే వాసు అన్నారు. ఇప్పుడు కూటమి తరపున ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నివాళి అంటే జయంతి వర్ధంతి చేయడం ఒక్కటే కాదని వారి ఆశయాలను కూడా ఆచరణలో పెట్టాలని అన్నారు. మద్యం దుకాణాలు, బార్ల ఏర్పాటుల్లో 10 శాతం రిజర్వేషన్లు గీతకులాలకు కల్పించడం జరిగిందని ఆయన గుర్తుచేసారు. ఇది బీసీలకు ఇచ్చిన గౌరవం అన్నారు. అంతటితో ఆగకుండా దామాషా ప్రకారం బిసిలకు పదవులు కూడా ఇవ్వాలని భావించి నగర టిడీపిప్రధాన కార్యదర్శిగా బుడ్డిగ రాధ, టౌన్ బిసి సెల్ అధ్యక్షులుగా బుడ్డిగ రవి, పీఎంకే సత్రం చైర్మన్ గ రెడ్డి మణి, శ్యామలాంబ అమ్మవారి ఆలయ చైర్మన్ గ కడియాల వీరభద్రరావు, అర్బన్ హెల్త్ సెంటర్ల చైర్మన్ గ రాయుడు గణేష్, చెల్లుబోయిన మూర్తిలను నియమించామని ఎమ్మెల్యే వాసు వివరించారు. ముఖ్యంగా రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గ కుడుపూడి సత్తిబాబు నియమితుల య్యారని ఆయన గుర్తుచేసారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ బీసీలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే వాసు చెప్పారు గతంలో బీసీల కోసం ఆదరణ పథకాన్ని అమలు చేసి బీసీలకు వారి వృత్తి పరమైన పని ముట్ల అందించడం జరిగిందని, అయితే ఆ తరువాత అధికారం చేపట్టిన జగన్‌ ఆ ఆదరణ పథకాన్ని అటకెక్కించారని ఎమ్మెల్యే వాసు విమర్శించారు. అలాగే రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, కూడా గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి గౌతుల చిన్న చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *