సర్దార్ గౌతు లచ్చన్న ఒక స్వాతంత్ర్య సమరయోధుడు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంకిత భావంతో కృషి చేసిన ప్రజా నేత గౌతు లచ్చన్న అని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా నగరంలోని బస్టాండ్ సెంటర్ వద్దగల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సర్దార్ గౌతు లచ్చన్న ఒక స్వాతంత్ర్య సమరయోధుడు, నిస్వార్థ రాజకీయ నాయకుడు మరియు పేదల ఆశాజ్యోతి అన్నారు. ఆయన జీవితం నిత్యం పోరాటాలతో ప్రజాసేవకు అంకితమైనదన్నారు. భావి తరాలు ఆయన పోరాట పటిమ, పేదల పట్ల ఆయన చూపిన సేవా నిరతిని స్పూర్తిగా తీసుకొని సమాజ సేవలో పాల్గొనాలని తెలిపారు. గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర్య సంగ్రామంలో పాలుపంచుకొని ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. కేవలం స్వాతంత్ర్యం కోసం మాత్రమే కాకుండా, స్వాతంత్ర్యం తర్వాత బడుగు, బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడారన్నారు. కావున అందరం గౌతు లచ్చన్నగారి ఆశయాల మేరకు నడుచుకోవాలని పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *