రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ మార్గదర్శకత్వంలో ఇండియా స్కిల్స్ పోటీ – ఆంధ్రప్రదేశ్ 2025 కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.డి.జి. మురళి తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలో 63 స్కిల్ ట్రేడ్స్‌లో యువత తమ ప్రతిభను ప్రదర్శించి, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో వరల్డ్ స్కిల్స్ 2025లో పోటీపడే అవకాశం పొందనున్నారు. ఈ పోటీలో పాల్గొనడానికి అర్హతగా 01-01-2001 తర్వాత జన్మించినవారు 13 ట్రేడ్స్‌లో మరియు 01-01-2004 తర్వాత జన్మించినవారు 50 ట్రేడ్స్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని తెలియ చేశారు.
రిజిస్ట్రేషన్ చివరి తేదీ 30 సెప్టెంబర్ 2025 గా నిర్ణయించబడింది. రిజిస్ట్రేషన్ కోసం నైపుణ్యం పోర్టల్ (https://naipunyam.ap.gov.in/world-skill-registration) మరియు స్కిల్ ఇండియా డిజిటల్ పోర్టల్ (https://www.skillindiadigital.gov.in/account/register?returnUrl=%2Findia-skills-2025) లో అవకాశాలు కల్పించబడ్డాయన్నారు.
ఈ పోటీలో పాల్గొనడం ద్వారా విద్యార్థులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు, ఇండస్ట్రీ-రెలవెంట్ సర్టిఫికేషన్, కెరీర్ మరియు ఉద్యోగ అవకాశాలు, ఆధునిక నైపుణ్యాల్లో అనుభవం వంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు, కళాశాలలు మరియు సంస్థలు విస్తృతంగా ప్రచారం చేసి, యువతను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
మరిన్ని వివరాలు మరియు రిజిస్ట్రేషన్ సహాయం కోసం బాబు (9676052454), గణేష్ (8328507473) మరియు ఇతర సమన్వయ సహాయం కోసం గోపాల్ (9948995678) ను సంప్రదించవచ్చని తెలిపారు.
Prajavartha Online Telugu News