రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రభుత్వ ఆర్థిక సేవల శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా 01-07-2025 నుండి 30-09-2025 వరకు ఆర్థిక చేరిక పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ప్రచారం జరుగుతోందని బ్యాంక్ ఆఫ్ బరోడా ఏజీఎం & రీజినల్ హెడ్ సిహెచ్. శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఈ ప్రచారం ద్వారా PMJDY, PMJJBY, PMSBY, APY వంటి పథకాల ప్రయోజనాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా, బ్యాంక్ ఆఫ్ బరోడా – రాజమండ్రి రీజియన్ ఆధ్వర్యంలో 03-09-2025 (బుధవారం) ఉదయం 10.00 గంటలకు, రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం గృహం లో ఆర్థిక చేకూర్పు అవగాహన శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ శిబిరానికి సుమారు 700 మంది ప్రజలు హాజరుకానున్నారని తెలియ చేశారు.
ఈ శిబిరానికి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ పి . ప్రశాంతి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కార్పొరేట్ సెంటర్ – ముంబై), హైదరాబాద్ జోనల్ హెడ్ లతో పాటుగా పలువురు ప్రభుత్వ, బ్యాంకు అధికారులు హాజరవుతారని తెలిపారు. ఆర్థిక చేకూర్పు పథకాలు ప్రతి అర్హులైన వ్యక్తులకు చేరుకునేలా, ప్రజల్లో మరింత అవగాహన పెరగాలన్న ఉద్దేశంతో ఈ శిబిరానికి నిర్వహిస్తున్నట్లు శ్రీనివాసులు తెలియ చేశారు.
Prajavartha Online Telugu News