అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 5వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు వ్యాలీ మండలం, మదగడ గిరిజన గ్రామాన్ని సందర్శిస్తారు. మదగడ గ్రామస్తులు నిర్వహించుకునే ఆదివాసీ సంప్రదాయ ఉత్సవం ‘బలి పొరోబ్’ లో పాల్గొంటారు. మదగడ గ్రామ పంచాయతీ పరిధిలో మాత్రమే 12 రోజులపాటు నిర్వహించే బలి పొరోబ్ ఉత్సవాలు గత నెల 25వ తేదీన ప్రారంభమయ్యాయి. అల్లూరి జిల్లాతోపాటు మన్యం జిల్లా, ఒడిశా రాష్ట్ర ఆదివాసీలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. గిరి పుత్రుల ఆహ్వానం మేరకు చివరి రోజు ఉత్సవాలకు పవన్ కళ్యాణ్ హాజరవుతారు.
Tags amaravathi
Check Also
ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్
-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …
Prajavartha Online Telugu News