Breaking News

డీఆర్డీఏ- వెలుగు ఆధ్వర్యంలో జీవనోపాదుల కార్యక్రమాలు ప్రణాళిక అమలుపై సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవనోపాదుల ప్రణాళికలు సక్రమంగా అమలు కోసం డీఆర్డీడీఏ ను సమన్వయం చేసుకుంటూ సంబంధిత శాఖల అధికారులు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ అధ్యక్షతన డీఆర్డీఏ- వెలుగు ఆధ్వర్యంలో జీవనోపాదుల కార్యక్రమాలు ( livelihood Activities) ప్రణాళిక అమలుపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో అనేక పధకాల ద్వారా రాయితీతో కూడిన ఆర్ధిక సహాయంను అందిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం లఖ్ పతీ దీదీ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ఒన్ ఫ్యామిలీ, ఒన్ ఎంటర్పెన్యూర్ కార్యక్రమం ద్వారా స్వయం సహాయ సంఘాల్లోని మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ సేవా, తయరీ రంగాల్లో వ్యాపార సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహాం అందిస్తున్నాయన్నారు. జిల్లాలో ముఖ్యంగా వ్యవసాయం, ఉద్యాన శాఖ, పశుసంశర్ధక శాఖ, పరిశ్రమల శాఖ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు, నాచురల్ ఫార్మింగ్ తదితర రంగాల్లో అవకాశం ఉన్నందున వీటిలో లాభదాయకమైన వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసేలా సంబంధిత శాఖల క్షేత్ర స్థాయి అధికారులు మహిళలను ప్రోత్సహించాలన్నారు. డీఆర్డీఏ లోని ఏపీవోలు, వీఏవోలు ప్రభుత్వ శాఖల్లో పరిశ్రమలు ఏర్పాటుకు అందిస్తున్న సహాయ, సహకారాలపై ఎస్ హెచ్ జీ మహిళలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఒన్ డిస్ట్రిక్ ఒన్ ప్రాజెక్ట్ ద్వారా ఎఫ్ పీ ఓ లు ఏర్పాటు చేసే క్లస్టర్ల లోను, పరిశ్రమల్లోను మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రభుత్వ శాఖల వార్షిక ప్రణాళికల్లోను మహిళా పారిశ్రామిక వేత్తల ప్రోత్సహానికి అవసరమై లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని అధిగమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకర్లు ద్వారా రుణాలు మంజూరు అయ్యేలా ఎల్డీఏం, డీడీఎం నాబార్డు సహకారం అందించాలన్నారు.
సమావేశంలో పాల్గోన్న డీఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మీ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వ శాఖలు వారి దగ్గర ఉన్న స్కీమ్స్, సబ్సిడీ స్కీమ్స్ పై అవగాహన కల్పిస్తే జీవనోపాధులు అందిపుచ్చుకుంటారని తెలిపారు. కొలకలూరు నందు ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించుకొనుటకు ఒక దాతచే ఒక ఎకరం పొలం కూడా కేటాయించబడినదని , దీనిలో ఏపీఐఐసీ సహకారంతో పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఫిరంగిపురం మహిళా మార్ట్ మాదిరిగా మిగిలిన అని మండలాలో కూడా మార్ట్ లు ఓపెన్ చేస్తున్నామని, అన్ని మండలాల్లో ఎఫ్ పీ ఓలు రిజిస్ట్రేషన్ కు చర్యలు తీసుకుంటున్నామన్నారు. డీఆర్డీఏ ద్వారా వివిధ శాఖల సమన్వయంతో ఎస్ హెచ్ జీ మహిళల జీవనోపాదుల మెరుగుదలకు అమలు చేస్తున్న కార్యక్రమాలు, అందిచాల్సిన సహకారం పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
డీఆర్డీఏ ద్వారా జిల్లాలో ఎస్ హెచ్ జీ మహిళలు అందించిన ఆర్ధిక సహాయంతో సైనిక సంక్షేమ నిధికి రూ.6,41,075 నిధులు అందించినందుకు జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారి గుణశీల జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీని, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మీని, ఏపీవోలను సర్టిఫికేట్, మెమోంటోతో ఘనంగా సన్మానించారు.
సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజరు మహిపాల్ రెడ్డి, నాబార్డు డీడీఎం శరత్ బాబు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నాగేశ్వరరావు, డ్వామా పీడీ శంకర్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవీందర్ బాబు, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మీ, జిల్లా టూరిజం అధికారి రమ్య, జిల్లా ఏపీఎంఐపీ పీడీ వజ్రశ్రీ, ఏపీసీఎన్ఎఫ్ పీడీ రాజకుమారి, జిల్లా పశుసంవర్ధకశాఖ జెడీఏ సత్యనారాయణ, జిల్లా చేనేత, జౌళి శాఖ డెవల్మేంట్ అధికారి శ్రీధర్ బాబు, జిల్లా సమాఖ్య అధ్యక్షులు కె పద్మ, కార్యదర్శి గిరిజ, ఏపీఓలు, వీవోలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *