NH-16 రహదారి నిర్వహణలో నిర్లక్ష్యం – క్షేత్రస్థాయి పర్యవేక్షణలో లోపంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆగ్రహం

రాజమహేంద్రవరం / రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు మరియు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బుధవారం విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తున్న క్రమంలో రాజమండ్రి సమీపంలో కొల్‌కత్తా – చెన్నై హైవే (NH-16) లో జరుగుతున్న రహదారి నిర్వహణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అన్నవరం నుంచి దివాన్ చెరువు వరకు 70 కి.మీ. మేర జాతీయ రహదారి నిర్వహణ పనులు TOT (టోల్–ఆపరేట్–ట్రాన్స్‌ఫర్) పద్ధతిలో ముంబైకి చెందిన సేఫ్ వే అనే ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయి పర్యవేక్షణలో ఎన్ హెచ్ అధికారుల నిర్లక్ష్యం కనబడుతుండటంపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

రహదారి అభివృద్ధి – నిర్వహణ పనులు జరుగుతున్న తీరుపై స్థానికంగా ఎన్ హెచ్ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని మంత్రి స్పష్టం చేశారు. ఈ పనుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్ హెచ్ ఉన్నతాధికారులకు ఆదేశించారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా రహదారి అభివృద్ధిలో వినియోగిస్తున్న మెటీరియల్ నాణ్యత ప్రమాణాలను పరిశీలించి, పనుల నాణ్యతలో ఎలాంటి రాజీపడరాదని హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన రహదారులు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కాబట్టి నిర్దిష్ట గడువు పెట్టుకుని వేగవంతంగా పనులను పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *