జల్ జీవన్ మిషన్ కింద 3.30 లక్షల ఇళ్లకు టాప్ కనెక్షన్లు

-కలెక్టర్– పి ప్రశాంతి కలెక్టర్
-జిల్లా అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర అదనపు జాయింట్ సెక్రటరీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో జల్ జీవన్ మిషన్ (JJM) పథకం కింద ఇప్పటివరకు 3,56,543 ఇళ్లలో 3,30,000 ఇళ్లకు గృహాల టాప్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. బుధవారం భారత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అదనపు జాయింట్ సెక్రటరీ సి. కమల్ కిషోర్ న్యూ ఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు 92 శాతం గృహాల వివరాలను ఐఎమ్‌ఐఎస్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేశామన్నారు. పూర్తి చేసిన పనుల వివరాలు అప్లోడ్ చేసేందుకు “ఐఎమ్ఐఎస్ ” జిల్లా స్థాయిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలో నెలవారీగా డిస్ట్రిక్ట్ వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి ప్రశాంతి వివరించారు. జూన్ 3, జూలై 8, ఆగస్టు నెలల్లో సమావేశాలు నిర్వహించి పనుల పురోగతిని సమీక్షించామని తెలిపారు.

జిల్లాలో గ్రామ పంచాయతీ స్థాయిలో ఎస్‌హెచ్‌జీ మహిళలను కన్సల్టెంట్లుగా నియమించి, స్వచ్ఛ భారత్ మిషన్, వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్, వ్యక్తిగత గృహాల లెట్రిన్లు, కమ్యూనిటీ సోక్ పిట్స్, శానిటరీ కాంప్లెక్స్‌లు, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, నిత్య జల సరఫరా మానిటరింగ్ సిస్టమ్ పనులు ప్రగతిలో ఉన్నాయని కలెక్టర్ పి ప్రశాంతి చెప్పారు. జిల్లాలోని 865 పాఠశాలలు, 868 ఆంగన్‌వాడీ కేంద్రాలకు సురక్షితమైన త్రాగునీటి టాప్ కనెక్షన్లు అందజేసినట్లు తెలిపారు. ఎస్టీ హౌస్‌హోల్డ్‌లలో 2,200 ఇండ్లకు సంబంధించి 80 శాతం కనెక్షన్లు ఇచ్చి, మిగిలిన వాటికి త్వరలో పూర్తి చేయనున్నట్లు వివరించారు.

జిల్లాలో ఇప్పటికే రూ.144.38 కోట్లతో 491 పనులు పూర్తి చేసి గ్రామ పంచాయతీలకు అప్పగించామని, మరో రూ.24.75 కోట్లతో చేపట్టిన 48 పనులు పూర్తి కావడంతో త్వరలో వాటిని కూడా పంచాయతీలకు అప్పగిస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. అదే విధంగా PMGati Shakti ప్రోగ్రాం కింద జిల్లాలో 2,517 కి.మీ. పైప్‌లైన్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 2,355 కి.మీ. (93.55%) పనులు పూర్తి చేసి డేటా అప్లోడ్ చేసినట్లు చెప్పారు. ఇంకా రూ.55.69 కోట్ల విలువైన 71 పనులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. జిల్లాలో జల్ జీవన్ మిత్రలుగా ఐటీఐ, పాలిటెక్నిక్, పీఎంకేకేవై, అర్సెట్టి లలో శిక్షణ పొందిన యువతను నియమించ నున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

ఈ సందర్భంగా ఏ జె ఎస్ సి.కమల్ కిషోర్ మాట్లాడుతూ – “జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం సమయానుకూలంగా జారీ చేసిన మార్గదర్శకాలు, విధాన నిర్ణయాలను గ్రామ పంచాయతీ స్థాయిలో అవగాహన కల్పించి అమలు చేయాలని” సూచనలు ఇచ్చారు. జిల్లాలో అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి, ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్ ఈ.బి.వి. గిరి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *