Breaking News

కొత్త రాజరాజేశ్వరి పేట లోని డయేరియా కేసులను సమీక్షించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి శనివారం సాయంత్రం కొత్త రాజరాజేశ్వరి పేటలో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ జరుగుతున్న నీటి సరఫరా, నమోదైన డయేరియా కేసులు వాళ్ళ స్థితిగతులను విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, డి ఎం ఓ హెచ్ సుహాసిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకమైన చర్యలు విజయవాడ నగరపాలక సంస్థ తీసుకుంటుందని, కేవలం రాజరాజేశ్వరి పేట లోనే కాకుండా నగరం మొత్తంలో అవగాహన కల్పించి ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ పర్యటనలో డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి, 57వ డివిజన్ కార్పొరేటర్ ఇసరపు దేవి, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *