Breaking News

ప్రజలే ఫస్ట్ : నూతన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

నరసరావు పేట, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు, ప్రజా ప్రయోజనాలే ఫస్ట్ అనే నినాదంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టరుగా కృతిక శుక్లా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ప్రతినిథులు, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేసి, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. 2016-18 కాలంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టరుగా పల్నాడు ప్రాంతంలో విరివిగా చేసిన పర్యటనలు తనకు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కృతిక శుక్లా ఐఏఎస్ గతంలో నిర్వర్తించిన బాధ్యతల వివరాలు

22-07-2024 నుండి 12-09-2025 వరకు ➤ డైరెక్టర్, ఇంటర్మీడియట్ విద్య

22-07-2024 నుండి 12-09-2025 వరకు ➤ డైరెక్టర్, వయోజన విద్య

22-07-2024 నుండి 12-09-2025 వరకు ➤ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్

04-04-2022 నుండి 28-03-2024 వరకు ➤ కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, కాకినాడ

06-02-2020 నుండి 04-04-2022 వరకు ➤ డైరెక్టర్, జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్

06-02-2020 నుండి 04-04-2022 వరకు ➤ డైరెక్టర్, డిఫరెంట్‌గా అబిల్డ్ & సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్

06-02-2020 నుండి 04-04-2022 వరకు ➤ మేనేజింగ్ డైరెక్టర్, APDASCAC

03-01-2020 నుండి 04-04-2022 వరకు ➤ డైరెక్టర్, మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమం మరియు DISHA స్పెషల్ ఆఫీసర్

24-06-2019 నుండి 02-01-2020 వరకు ➤ డైరెక్టర్, మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమం

11-02-2019 నుండి 24-06-2019 వరకు ➤ జాయింట్ కలెక్టర్ & అదనపు జిల్లా మేజిస్ట్రేట్, కృష్ణా జిల్లా

02-11-2018 నుండి 09-02-2019 వరకు ➤ డిప్యూటీ సీఈవో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్

18-11-2016 నుండి 12-08-2018 వరకు ➤ జాయింట్ కలెక్టర్, గుంటూరు

05-12-2015 నుండి 14-11-2016 వరకు ➤ సబ్ కలెక్టర్, మదనపల్లి

25-04-2015 నుండి 30-11-2015 వరకు
➤ అసిస్టెంట్ కలెక్టర్, విశాఖపట్నం

02-09-2013 నుండి 13-04-2015 వరకు ➤ IAS (ప్రొబేషనర్), జమ్మూ & కాశ్మీర్ క్యాడర్

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *