సమస్యలు చెప్పండి, నేను పరిష్కరిస్తా..

-ఆర్యవైశ్య ప్రముఖులకు ఎంపీ కేశినేని శివనాథ్ హామీ
-విజయవాడ ఉత్సవ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహణ – ఎంపీ శివనాథ్

తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తిరువూరు పట్టణంలోని కనక రెసిడెన్సిలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ఆర్యవైశ్య ప్రముఖులతో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజం ఎప్పుడూ సేవాభావంతో, వ్యాపార నైపుణ్యంతో ముందంజలో ఉంటుంది. ఈ సమాజం అభివృద్ధి చెందితే, సమాజమే కాదు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆర్యవైశ్యుల సమస్యలు ఉంటే చెప్పండి. నేను మీకు అండగా ఉంటాను, మీ సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తాను” అని హామీ ఇచ్చారు.

విజయవాడలో నిర్వహించిన ‘విజయవాడ ఉత్సవ్’ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రోత్సాహంతో విజయవాడ ఉత్సవ్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించగలిగాం. ఈ ఉత్సవం విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని, ప్రజల ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా నిలిచింది. అన్ని వర్గాల ప్రజలు దీనికి విశేషంగా స్పందించారు” అన్నారు.

ఆర్యవైశ్యులు వ్యాపార రంగంలోనే కాకుండా, సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు. సమాజానికి మీరు చేస్తున్న సహకారం ప్రశంసనీయమైనది. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో కూడా మీరు చురుకుగా పాల్గొని సహకరించాలి” అని ఎంపీ శివనాథ్ పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు ఎంపీకి తమ సమస్యలు వివరించగా, వాటిని పరిష్కరించేందుకు తగిన ప్రయత్నం చేస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

మున్సిపల్ కౌన్సిలర్ నాళ్ళ సురేంద్ర, జంగాల మురళీకృష్ణ, బొడ్డు శ్రీనివాసరావు, గుడిమెట్ల రామారావు, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గుడిమెట్ల మురళి, ఆర్యవైశ్య ప్రముఖులు సంకా రాజా, కొల్లిపర సుబ్బారావు, గుడిమెట్ వెంకటేశ్వరరావు, భూమా కనకయ్య, నాగబండి రామకృష్ణ, కొత్తగుండ్ల కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *