నగరంలో “స్పైస్ ఇన్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్” ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గం, విజయనగర్ కాలనీ, హై స్కూల్ రోడ్, ఆర్ ఆర్ గార్డెన్ లో “స్పైస్ ఇన్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్” ను ఆదివారం ఎంపీ కేశినేని శివ‌నాథ్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి రెస్టారెంట్ నిర్వ‌హ‌కులు అర్జున రావుకి ఎంపీ కేశినేని శివ‌నాథ్ అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ అర్జున్ రావు తో త‌న‌కి ఎన్నో సంవత్సరాలుగా ప‌రిచ‌యం వుంద‌ని, భ‌విష్య‌త్తులో మరెన్నో బ్రాంచ్ లు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌ర్ధ‌వంత‌మైన పాల‌న‌లో అభివృద్ది, సంక్షేమం అంద‌టంతో రాష్ట్రంలోనే కాదు, న‌గ‌రంలో కూడా పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంద‌న్నారు. వైబ్రెంట్ సిటీగా విజయవాడ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న‌ట్లు తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ కి రెస్టారెంట్ నిర్వ‌హ‌కులు అర్జున రావు కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

రెస్టారెంట్ నిర్వ‌హ‌కులు అర్జున రావు మాట్లాడుతూ ఆహారప్రియుల అభిరుచులకు అనుగుణంగా వెజ్, నాన్ వెజ్ వంటకాలు అనుభవజ్ఞులైన చెఫ్ లతో వినూత్నమైన వంటకాలతో ముందుకు రావడం జరిగిందన్నారు. క్వాలిటీ కోసం వివిధ ప్రాంతాల నుండి దినుసులు, సరుకులు రేటుతో రాజీపడకుండా కొనుగోలు చేసి అందుబాటు ధరలతో క్వాలిటీకి, రుచి, శుచికి రాజీపడకుండా విజయవాడ మహానగరంలో ఉన్న రెస్టారెంట్లు కన్నా మంచి రుచి గల నాణ్యత గల ఆహారాన్ని వినియోగదారులకు అందుబాటు ధరల్లో అందజేస్తున్నామన్నారు. విజయవాడ నగర ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి వంటకాలు రుచి చూసి ఆశీర్వదించాల్సిందిగా కోరారు.

ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేటర్లు ముమ్మినేని ప్రసాద్,దేవినేని అపర్ణ, రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శులు, బొప్ప‌న భ‌వ‌కుమార్, ఎమ్.ఎస్.బేగ్, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్,టిడిపి రాష్ట్ర కార్య‌ద‌ర్శి చెన్నుపాటి గాంధీ, హరివిల్లు సీ ఎం డి చౌదరి ల‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *