విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మూడవ రాజకీయ ప్రత్యామ్నాయంగా జాతీయ ప్రజాస్వామిక లౌకిక కూటమి (NDSF) నిలుస్తుందని ఫ్రంట్ చైర్మన్ వడ్లమూరి. కృష్ణ స్వరూప్ ప్రకటించారు. నేడు విజయవాడ లోని అజిత్ సింగ్ నగర్ అంబేద్కర్ హల్లో జరిగిన ఫ్రంట్ రాష్ట్ర భాగస్వామ్య సంస్థల ప్రతినిధుల సమావేశం దళిత బహుజన పార్టీ (DBP) ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ ఎస్.ఆంజనేయకుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితుల పైన దాడులు జరుగితున్నా.. NDA సర్కార్ స్పందించటలేదన్నారు. శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. మనువాదల పాలన లో అణగారిన కులాలకు రక్షణ లేదన్నారు. రాజ్యాంగం ప్రకటించిన ప్రాధిమిక హక్కులు కాలరాయబడుతున్నాయని.. విద్యా. వైద్యం. ఖరీదు గా మర్చివేసారన్నారు. దోపిడీ కుల పాలకుల పాలనలో దళిత బహుజన ప్రజలకు న్యాయం జరగదన్నారు. చట్ట సభ ల్లో నిమ్న జాతుల గళం వినిపించాలంటే. చీలిపోయిన ఎస్సీ. ఎస్టీ. బీసీ. మైనారిటీ పేద ప్రజలు ఐక్యత గా ఉంటేనే రాజకీయ అధికారం సాధించికోగలుగుతామని.. ఐక్యత కాకపోతే ఈ మాఫియా పాలకులు మనలని బానిసలుగా మారుస్తారని తెలిపారు.
దళిత బహుజన రాజకీయ శక్తులు అంతా NDSF ను బలోపేతం చేసుకోవాలని పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు తక్షణమే విడుదల చేసి దళిత వాడల సామాజిక. ఆర్ధిక. వైద్యం. విద్యా అభివృద్ధి కి ఖర్చు చేయాలని.. బీసీల వృత్తి కులాల అభివృద్ధికి ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని.. దళిత క్రిస్టియన్. దళిత ముస్లిం లను ఎస్సీ జాబితా లో చేర్చాలని..NDA పాలన లో దళితుల పైన జరిగిన దాడుల ఘటన ల పైన న్యాయ విచారణ చేయడానికి రాష్ట్ర గవర్నర్ చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేసారు నిత్యావసర వస్తువులు, పాలు, నూనె, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇంటి పన్నులు, విద్యుత్ చార్జీలు ధరలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వంను డిమాండ్ చేసారు. NDSF ప్రాంతీయ సదస్సులను ఈ నెల 26 నుండి జనవరి 25 వరకూ…తిరుపతి, కర్నూల్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం కేంద్రాల్లో రాజ్యాధికారం సాధన సదస్సు లను నిర్వహించాలని, మనువాద పాలకుల నుండి అంబేద్కర్ రాజ్యాంగంను రక్షించికుందాం.. దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో జనవరి 26న ఛలో రాజభవన్ గవర్నర్ కార్యక్రమం చేపట్టాలని, రానున్న స్థానిక ఎన్నికల్లో NDSF ఫ్రంట్ తరుపున ఉమ్మడి గా పోటీ చేయాలని NDSF సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. ఈ సమావేశంలో NDSF రాష్ట్ర కో ఆర్డినేటర్ సవలం శ్యాం ప్రశన్న కుమార్, (క్రిస్టియన్ అడ్వకేట్స్ లీగ్) రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా RPI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. అశోక్ కుమార్, బోయ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్. వీరన్న నాయుడు, జాతీయ వడ్డెర సంఘము అధ్యక్షులు ఉప్పు, రాంబాబు. మాలమహానాడు విజయవాడ మహిళా అధ్యక్షురాలు బి. ఉషారాణి, సోషల్ లిస్ట్ పార్టీ. ఇండియన్ నేషనల్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరావు, జయబాబు, దళిత బహుజన పార్టీ DBP నగర నాయకులు కె.కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News