జగన్ రెడ్డి కృష్ణాజిల్లా పర్యటన దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్లు ఉంది… కోనేరు నాగేంద్ర కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కోనేరు నాగేంద్ర కుమార్ (నాని) గత కొన్ని రోజుల క్రితం వచ్చిన మొందా తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలకు, నష్టపోయిన రైతులకు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదుకోవడం జరుగుతుందని,అధికారులు పంట నష్టం అంచనా వేయడంలో నిమగ్నం అయ్యి ఉన్నారని నేడొక ప్రకటనలో తెలిపారు.

మొందా తుఫాను ముంచుకు వస్తుందని, తీరం దాటే సమయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించడంతో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారుల అప్రమత్తం చేసి, అన్ని శాఖల అధికారులు ముఖ్యంగా రెవిన్యూ, మునిసిపాలిటీ, విద్యుత్ శాఖల సిబ్బందిని ఎక్కడకక్కడ అందుబాటులో ఉంచి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడగలిగారన్నారు. పునరావాస కేంద్రాల ఏర్పాటు చేసి స్థానిక అధికారులు, పోలీసుల సహాయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించి వారికి మంచి నీరు, పాలు ,భోజన సదుపాయాలు కల్పించారని, మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేసి పునరావా కేంద్రాల దగ్గర అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.

నిన్న జగన్ రెడ్డి కృష్ణాజిల్లాలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్లి అక్కడ ముసలి కన్నీరు కారుస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఒక పక్క వాతావరణ శాఖ, మీడియా మొందా తుఫాన్ పై ప్రతి నిమిషం ప్రజలను అప్రమత్తం చేస్తుంటే దానికి కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెకటేరియట్లో రోజంతా కూర్చుని అధికారులు అప్రమత్తం చేసి, పర్యవేక్షించి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా కాపాడుకుంటే, జగన్ రెడ్డి మాత్రం లండన్ లో కూర్చుని సేద తీరుతున్నాడు అన్నారు. దొంగలు పడ్డాక ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్లు తుఫాను వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత జగన్ రెడ్డి రైతుల పరామర్శ పేరుతో కృష్ణాజిల్లాలో డ్రామాకు తెర లేపాడని విమర్శించారు.

జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు తుఫానులు వస్తే ఒకసారి జెరూసలేం లో ఉన్నాడని, ఒకసారి హైదరాబాదులో సినిమా థియేటర్లో కూర్చున్నాడని, ఒకసారి బెంగుళూరు ప్యాలెస్ లో ఉన్నాడని గుర్తు చేశారు. నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించడానికి కిలోమీటర్ దూరంలో డయాస్ ఏర్పాటు చేసుకుని వైసిపి పెయిడ్ ఆర్టిస్ట్ లను పెట్టి జిందాబాద్ లు కొట్టించుకున్న ఘనుడు జగన్ రెడ్డి అన్నారు. మొందా తుఫాను వల్ల పంట నష్టం అంచనా కూడా జగన్ రెడ్డికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ రెడ్డి కృష్ణా జిల్లా కార్యక్రమం రైతుల పరామర్శ యాత్ర లాగా లేదని, వైసీపీ నాయకుల బల ప్రదర్శనలా ఉందన్నారు. ఎక్కడికక్కడ వాహనదారులను వైసిపి నాయకులు ఇబ్బందులకు గురి చేశారని, స్థానిక ప్రజలు జగన్ రెడ్డిని చిదరించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు జగన్ రెడ్డికి ప్రతిపక్ష హోదాకు లేకుండా 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెట్టినా సిగ్గు లేకుండా రైతులపై విషం చిమ్మడానికి ప్రయత్నించాడని, జగన్ రెడ్డి మాయమాటలు రైతుల నమ్మే పరిస్థితిలో లేరన్నారు.

మొందా తుఫాన్ కు నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదుకుంటారని, రాష్ట్రంలోని రైతాంగానికి చంద్రబాబు పై నమ్మకం ఉందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *