Breaking News

ఘనంగా శ్రీ కౌండిన్య మహర్షి జయంతి కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యనమలకుదురు లోని రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరాం ప్రసాద్ గౌడ్ కార్యాలయంలో ఈ రోజు శ్రీశ్రీశ్రీ కౌండిన్య మహర్షి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ కౌండిన్య మహార్షి చిత్రపటానికి రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శొంఠి శివరాం ప్రసాద్ గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

శొంఠి శివరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున జన్మించిన గౌడ కుల గోత్రం, గౌడ వంస మూల పురుషుడు శ్రీశ్రీశ్రీ కౌండిన్య మహార్షి జయంతి కార్యక్రమం నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని కులాల వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగే విధంగా మహర్షి ఆశీస్సులు కలగాలని కోరుకున్నారు. శ్రీశ్రీశ్రీ కౌండిన్య మహార్షి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా కూటమి ప్రభుత్వం నిర్వహించే విధంగా గౌడ కులస్తులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రయత్నం చేస్తామని, ఈ విషయంపై చంద్రబాబు సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వీరంకి కుటుంబరావు,జన్ను నాగరాజు, ఆరేపల్లి దాసు, ఈడే శ్రీనివాసరావు, అనగాని కొండలరావు, బలగం కొండ, భూక్యరాజా, పరిసే గోపి, రాముని యువరాజు, శేషు, ఆరేపల్లి శ్రీనివాసరావు, తాడిశెట్టి ప్రసాద్, మరియు గౌడ సంగీయులు, నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *