-గౌడ ఉప కులాలన్నింటినీ గౌడ కులంగానే పరిగణించాలి
-తాటి ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించి గీత కుటుంబాలకు ఉపాధి కల్పించాలి
-గీతకార్మికులకు పెండింగ్ లో ఉన్న ఎక్స్ గ్రేషియాను వెంటనే విడుదల చేయాలి : వీరంకి
-మద్యంషాపులు..బార్లు కేటాయింపుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి సవితలకు కృతజ్ఞతలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గౌడ సామాజికవర్గాంలో ఉన్న ఉప కులాన్నింటినీ కలిపి ఒకే గౌడ కులంగా పరిగనిణించాలని రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి కోరారు. ఇటీవల రాష్ట్రంలో మద్యం షాపులు, బార్లలో గౌడ కులస్తులకు 10 శాతం షాపులు 50% సబ్సిడీతో కేటాయించడంపై కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి సవితమ్మలకు రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, డైరెక్టర్లు శొంఠి శివరాం ప్రసాద్ గౌడ్ తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు. బీసీ భవన్లో బీసీ వెల్ఫేర్ మంత్రి సవితను గౌడ సంఘీయులు కలిశారు. పలు సమస్యలపై గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి, డైరెక్టర్లు శొంఠి శివరామ ప్రసాద్ గౌడ్, లక్ష్మీ శైలజ గౌడ్ పంది ధనుంజయ గౌడ్, మట్టా ప్రకాష్ గౌడ్, యామాన నారాయణ గౌడ్, బడుగు శ్రీకాంత్ గౌడ్, జంపాని రామచంద్రరావు గౌడ్, వెలగాన సూర్యారావు, పామర్తి వెంకటరామయ్య, మిద్దె ఆదినారాయణ, తుమ్మల చెంగయ్య, మట్టా మంగరాజు లు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ.. గీత కార్మికులకు మెరుగైన ఉపకరణాలు అందించాలని, గౌడ ఉప కులాలన్నింటినీ గౌడ కులంగానే పరిగణించాలని, తాటి ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించి గీత కుటుంబాలకు ఉపాధి కల్పించాలని గీతకార్మికులకు పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియాను వెంటనే విడుదల చేయాలి కోరారు. గీత వృత్తిదారులు చెట్లపై నుండి పడి చనిపోయిన వారి కుటుంబాలకు, చెయ్యి కాలు విరిగిపోయి మంచాలకు పరిమితమైన కుటుంబాలకు 2019 నుండి 2025 వరకు పెండింగ్లో ఉన్న గీత కార్మికుల పరిహారాన్ని త్వరితగతిన విడుదల చేసి వారి కుటుంబాలకు ఇప్పించి ఆదుకోవాలన్నారు. అలాగే, అంతరించిపోతున్న గీత కార్మిక వృత్తిని ప్రోత్సహించి నీరా పరిశ్రమ ప్రభుత్వమే తీసుకువచ్చి తాటి ఉత్పత్తులతో తాటి బెల్లం చాక్లెట్స్, డ్రింక్స్, తాటి ఆకులతో బొమ్మలు తయారి వంటి తాటి ఉత్పత్తులను తయారు చేసేందుకు, వాటికి మార్కెటింగ్ సదుపాయం కల్పించి మన రాష్ట్రంలో సుమారు 20 లక్షల గీత కుటుంబాలకు ఉ పాధి కల్పించాలని, గీత కులాల పిల్లలను ఉన్నత చదువులకై విదేశీ విద్య పథకం కింద సాయం చేయాలని,, ఉన్నత చదువులు చదువుకోడానికి ప్రోత్సహించాలని, గీత కులాల వారు చిన్న పరిశ్రమల ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి ఆర్ధికసాయం అందించాలని, ఆదరణ పథకం ద్వారా గీత వృత్తిదారులకు మెరుగైన పనిముట్లు, మోటార్ సైకిల్ వాహనాలు సబ్సిడీ ద్వారా అందించాలని గురుమూర్తి తదితరులు కోరారు.
Prajavartha Online Telugu News