-నిబంధనలు ఉల్లంఘిస్తే మొబైల్ కోర్టులో హాజరు కావాల్సిందే
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం ఆదేశాలతో రోడ్ల పైన చెత్త వేసిన వారికి, కార్పొరేషన్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రతి శుక్రవారం నిర్వహించే మొబైల్ కోర్టులో 8వ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ గోలీ లెనిన్ బాబు, శుక్రవారం ఉదయం సర్కిల్-3 కార్యాలయం పటమట నందు సర్కిల్-3 పరిధిలోని శానిటరీ ఇన్స్పెక్టర్లు నమోదు చేసిన 29 కేసులపై విచారణ జరిపి వారికి Rs.8,350/- రూపాయలు జరిమానా విధించారు.మరోసారి ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు.
ఈ సందర్భంగా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం మాట్లాడుతూ, రోడ్లపై మాట్లాడుతూ చెత్త వేసిన మురుగు ప్రవాహానికి అడ్డుపెట్టిన, రోడ్డుపైన పెంపుడు జంతువుల్ని ఉంచినా, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై మొబైల్ కోర్ట్ చర్యలు తీసుకుంటుందని నగర ప్రజలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఎం ఓ హెచ్ 3 డాక్టర్ గోపాల్ నాయక్, శానిటరీ సూపర్వైజర్స్ బాలాజీ శ్రీనివాస మూర్తి, సర్కిల్ -3 సంబంధించిన శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News