శభాష్ కైవల్య

-వ్యోమగామి శిక్షణకు నిడదవోలు యువతి కైవల్య రెడ్డి ఎంపికపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం
-కైవల్య రెడ్డికి మంత్రి దుర్గేష్ అభినందనలు

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
అమెరికాలో ప్రతిష్టాత్మక వ్యోమగామి శిక్షణకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కుంచల కైవల్య రెడ్డి ఎంపికపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్షంలోకి అడుగుపెట్టే తన కలను సాకారం చేసుకునే దిశగా కీలక మైలురాయిని దాటిందని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాల అధిరోహించాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు.
ఏపీకి చెందిన నిడదవోలు యువతి అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. ఫ్లోరిడాలోని ‘టైటాన్స్ స్పేస్ ఇండస్ట్రీస్’ ఆధ్వర్యంలో జరిగే ఈ శిక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా 36 దేశాల నుంచి వేలాది మంది పోటీ పడగా, కేవలం 150 మంది మాత్రమే అర్హత సాధించారని వారిలో కైవల్య రెడ్డి ఒకరిగా నిలవడం విశేషమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ సందర్భంగా కైవల్య రెడ్డికి మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు.కైవల్య సాధించిన విజయాలను, వచ్చిన అవార్డులను మంత్రి దుర్గేష్ గతంలోనే ఒక పర్యాయం నిడదవోలు క్యాంప్ ఆఫీసులో పరిశీలించారు.చిన్న వయస్సులోనే ప్రతిభ చాటుకొని పదుల సంఖ్యలో రికార్డులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో ఏపీ తరపున చిన్నప్రాయంలోనే గుర్తింపు తెచ్చుకున్న చిన్నారిని అభినందిస్తూనే వ్యోమగామి కావాలన్న చిన్నారి కల నెరవేరాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *