కమ్యూనిస్టుల పునరేకీకరణ ఆవశ్యం

-జొహ్రాన్‌ మమ్దాని విజయంపట్ల హర్షం
-ట్రంప్‌ వ్యాఖ్యలపై మోదీ మౌనం
-నేపాల్‌లో కమ్యూనిస్టు పార్టీల ఐక్యత శుభపరిణామం
-18న సామాజిక న్యాయం కోసం దేశ వ్యాప్త ఆందోళనలు
-సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ

విజయవాడ,  నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబరు మహా విప్లవం స్ఫూర్తితో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులంతా పునరేకీకరణ కావాలని, ఆ దిశగా భారత్‌లో ఒక నూతన శక్తిని తీసుకురావాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పునరుద్ఘాటించారు.
విజయవాడ దాసరిభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. 1917లో అక్టోబరు మహావిప్లవం జరిగి నవంబరు 7న రష్యాలో మొట్టమొదటిసారిగా శ్రామిక రాజ్యం ఏర్పాటు జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టులంతా విప్లవ జేజేలు పలుకుతున్నారని, ఇదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక అనుకూల సంఘటనలు జరుగుతున్నాయని వివరించారు. కమ్యూనిస్టు పార్టీ బలహీనంగా ఉండే అమెరికాలో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల జరిగిన న్యూయార్క్‌ నగర మేయర్‌ ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ తరఫున కమ్యూనిస్టులు పోటీచేస్తున్నారంటూ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జొహ్రాన్‌ మమ్దానిని ఓడిరచాలంటూ ట్రంప్‌ పట్టుపట్టారని, ఆయన్ని ఓడిరచకపోతే ప్రభుత్వ నిధుల్లో కోత విధిస్తామని నిస్సుగ్గుగా ప్రకటించారని గుర్తుచేశారు. మమ్దానిని ప్రజలు ఎన్నుకుంటే 10 శాతం మంది ప్రజలు న్యూయార్క్‌ నగరాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతారని ప్రచారం చేశారన్నారు. మమ్దానిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించకూడదని దుష్ప్రచారం చేశారన్నారు. ఇన్ని ప్రచారాలను డ్రోనాల్డ్‌ ట్రంప్‌ చేసినప్పటికీ ప్రజలు ఘన విజయం చేకూర్చాని, అంత చేసినప్పటికీ మమ్దానికి స్పష్టంగా ప్రజలు తీర్పునిచ్చారని కొనియాడారు. ఈ సందర్భంగా సిపిఐ తరపున జొహ్రాన్‌ మమ్దాని గెలుపుపట్ల హర్షం వ్యక్తం చేశారు.
ట్రంప్‌ పదేపదే భారత దేశాన్ని కించపరుస్తూ 58 సార్లు ప్రకటనలు చేశారని, భారత్‌`పాకిస్తాన్‌ యుద్ధాన్ని నేనే ఆపానని చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. భారత్‌`పాకిస్తాన్‌ వ్యాపార లావాదేవీలను బంద్‌ చేస్తానని ట్రంప్‌ నొక్కిచెప్పారనీ, దీంతోనే భారత్‌`పాకిస్తాన్‌ యుద్ధం ఆగిపోయిందని చెప్పాడన్నారు. అన్నిసార్లు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపట్ల దేశ ప్రధాని మోదీ నిసిగ్గుగా మౌనంగా ఉండిపోతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్‌లో గంటన్నర ఉపన్యాసంలోను ట్రంప్‌ గురించి మోదీ ఒక్కమాట కూడా చెప్పలేదన్నారు. దేశ గౌరవ ప్రతిష్టలను కాపాడేందుకుగాను ట్రంప్‌ ప్రకటనను మోదీ స్పష్టంగా ఖండిరచాలని డిమాండ్‌ చేశారు.
నేపాల్‌లో ఉమ్మడిగా 9 కమ్యూనిస్టు పార్టీలు ఐక్యతతో ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. కమ్యూనిస్టులు ఐక్యం కావాలని ఆదేశంలోని కష్టజీవులైన ప్రజలు, వామపక్ష మేధావులు, నాయకులు కోరుకుంటున్నారని తెలిపారు. దేశంలోను కోట్లాది మంది కష్టజీవులు, వామపక్ష పార్టీలు దానిని ఆహ్వానిస్తున్నారని చెప్పారు. పాండిచ్ఛేరిలో జరిగిన సిపిఐ జాతీయ మహాసభల నుంచి తాము స్పష్టంగా కమ్యూనిస్టు పార్టీల పునరేకీకరణ కావాలని ఆకాంక్షిస్తున్నామని రామకృష్ణ గుర్తుచేశారు. దేశంలో 100 సంవత్సరాల చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందని, డిసెంబరు 26వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో వందలాది మందితో ర్యాలీ నిర్వహిస్తున్నామని, శత వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకోనున్నామని వెల్లడించారు. ఈ వంద సంవత్సరాలలో అనేక పోరాటాలు కమ్యూనిస్టులు చేశారని, సాయుధ పోరాటాలలోనూ భాగస్వాములయ్యారని, వేలాది మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేశారని వివరించారు. వేలాది ఎకరాల భూములు పంపిణీ చేశారని, కోట్లాది మంది శ్రామిక జనం తరపున, వారి హక్కుల కోసం పోరాటాలు జరిగాయన్నారు. నేపాల్‌ తరహాగా దేశంలోను కమ్యూనిస్టు ఉద్యమ అభిమానులు, వామపక్ష మేథావులు, సమస్త కార్మిక లోకం అంతా కమ్యూనిస్టులు ఏకంకావాలని కోరుంటున్నారని స్పష్టం చేశారు. అన్ని ఎర్రజెండా పార్టీలు సైతం ఒకే వేదికపై రావాలని ఆశిస్తున్నాయని, ఆ దిశగా దేశంలో ముందుకు సాగాలిసిన అవసరముందని అన్నారు. అటు నక్సలైట్లు అడవుల్లో ఉండి కూడా ఎన్నో పోరాటాలు చేశారని, సిపిఐ తెలంగాణ సాయుధపోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టులు ప్రాణ త్యాగం చేశారన్నారు. దేశం వ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో పాల్గొని కమ్యూనిస్టులు ఎనలేని త్యాగాలు చేశారని కొనియాడారు. మావోయిస్టులతో చర్చలు చేపట్టేందుకు కేంద్రం ముందుకు రావాలని కోరారు. 100 సంవత్సరాలల్లో దేశంలో కమ్యూనిస్టు పార్టీ ప్రధానంగా లేకపోవడానికి, అధికారానికి రాకపోవడానికి కమ్యూనిస్టు పార్టీల చీలికే కారణమని రామకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ అవసరమని నొక్కిచెప్పారు.
పార్టీ జాతీయ సమితి పిలుపులో భాగంగా దేశ వ్యాప్తంగా దళిత, గిరిజన, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా, జనగణనలో కులగణన చేపట్టాలని ఈనెల 18వ తేదీన దేశ వ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం ఆందోళనలు చేపడుతున్నామని, అన్ని రాష్ట్రాల్లోను కమ్యూనిస్టు పార్టీ నేతలు, ప్రజా సంఘాలు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో పార్టీ మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.దుర్గాభవాని, ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.
లెనిన్‌కు ఘన నివాళి
అక్టోబరు మహావిప్లవం సందర్భంగా విఐ లెనిన్‌ చిత్రపటానికి సిపిఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జల్లి విల్సన్‌, పి.దుర్గాభవానీ, దోనేపూడి శంకర్‌, జి.కోటేశ్వరరావు, టి మనోహర్‌నాయుడు, వై. చెంచయ్య, ఎం. రాజేంద్రప్రసాద్‌, యడ్ల కృష్ణకిషోర్‌, బాలకాశీ, లంకా గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *