-శాలివాహన సంఘం వనసమారాధనలో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి
తిరువూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కార్తీక వనసమారాధన వల్ల ప్రజల్లో ఐక్యత స్నేహ భావం పెంపొందుతాయని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. పట్టణంలో నాళ్ల నరసింహారావు మామిడి తోటలో శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్తీక మాస వనసమారాధన కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఎంపీ కేశినేని శివనాథ్ కు శాలివాహన సంఘం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన శాలివాహన కమ్యూనిటీ హాల్ అంశం పరిశీలించి ,నిర్మాణంకు కృషి చేస్తానన్నారు. శాలివాహన సంఘం సంక్షేమం, అభివృద్దికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాలివాహన సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ జీడిమళ్ల సత్యవతి, పి.ఎ.సి.ఎస్ డైరెక్టర్ సోమవరపు నాగేశ్వరరావు, శాలివాహన సంఘం నాయకులు సోమవరపు శ్రీను, జి.రామకృష్ణ, సోమవరపు చిన నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శావల దేవదత్, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు సంఘం నాయకులు చెరుకూరి నాగేశ్వరరావు, నియోజకవర్గ అబ్జర్వర్ సుఖవాసి శ్రీనివాసరావు, హజ్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ హుస్సెన్, తిరువూరు మండలపార్టీ అధ్యక్షుడు దుబ్బాకుల వెంకటేశ్వర్లు లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News