విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 43 వ డివిజన్ కు చెందిన పులి వీర వెంకట సత్యన్నారాయణ కు Rs.4,00,000/- యల్ఓసి అందుకున్నారు. నిరుపేద కుటుంభానికి చెందిన సత్యనారాయణ గుండెకు సంబంధించిన వ్యాధితో బాధ పడుతున్నాడు.. గుండె చికిత్సలో భాగంగా స్టెంట్ వేయాలని వైద్యులు సూచించగా, సూచించిన వైద్యం చేసుకొనే స్థోమత లేకపోవడంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ యలమంచలి సత్యన్నారాయణ చౌదరి (వైయస్ సుజనా చౌదరి) గారి కార్యాలయాన్ని జనసేన 43 డివిజన్ పార్టీ అధ్యక్షుడు బొల్లెపల్లి కోటేశ్వర రావు ద్వారా సంప్రదించగా వెంటనే స్పందించి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపి సహాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం Rs.400000/- యల్ ఓ సి ని మంజూరు చేసింది. గుండెకు సంబంధించిన రుగ్మత కు చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన నేడు యం యల్ ఏ కార్యాలయంలో అందించారు.
ఈ పత్రాలను నేడు యం యల్ ఏ కార్యాలయంలో పగడాల కృష్ణ, ఊర్మిలా నగర్ బి జె పి అధ్యక్షుడు – అన్న వరపు శ్రీను, 43 వ డివిజన్ టి డి పి అధ్యక్షులు – గొల్ల విశ్వేశ్వర రావు, 43 వ డివిజన్ బి జె పి అధ్యక్షులు – గన్నవరపు శ్రీను, బిజెపి నాయకులు – కరీముల్లా, బిజెపి నాయుకులు – వలీ, నియోజకవర్గ నాయకులు లతోపాటూ యం యల్ ఏ కార్యాలయ కార్యదర్శి పి శ్రీధర్ లు బాధితుని కుటుంబ సభ్యులకు అందజేశారు. యల్ ఓ సి పత్రాలను అందుకొన్న లబ్జిదారులు శాసనసభ్యులు సుజనా చౌదరి మరియు సత్వరం స్పందించి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News