-నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు
-జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్
-జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.డి.జీ. మురళి
రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం మండల ప్రజా పరిషత్ స్కిల్ హబ్ ప్రాంగణంలో ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించ నున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు.
ఈ జాబ్ మేళా డిసెంబర్ 30వ తేదీ (మంగళవారం) ఉదయం 10:30 గంటలకు మండల ప్రజా పరిషత్ ప్రాంగణంలో స్కిల్ హబ్ నందు జరగనుందనీ అయన తెలియచేశారు .
ఈ జాబ్ మేళాలో ప్రముఖ రాజేంద్ర ఎనర్జీ పవర్ సొల్యూషన్,ఫోన్ పే మరియు ఎస్ బి ఐ, అర్ బి ఎల్ క్రెడిట్ కర్డ్స్ సంస్థలలోని పలు ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయనీ వి.డి.జీ మురళి పేర్కొన్నారు. పది, ఐటిఐ,12వ తరగతి నుండి డిగ్రీ వరకు చదివిన అభ్యర్థులు, అలాగే అనుభవం ఉన్నవారు లేదా ఆసక్తిగలవారు 19 నుండి 30 సంవత్సరాల వయస్సు కలిగి ఉంటే అర్హులు అన్నారు. ఎంపికైన వారికి తక్షణమే ఉద్యోగ నియామక పత్రాలు అందిస్తామని తెలిపారు.
జాబ్ మేళా లో పాల్గొనే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగానే నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనీ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.డి.జీ. మురళి తెలిపారు. జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు బయో డేటా, ఆధార్ కార్డు, విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు వెంట తీసుకునీ రావాలని సూచించారు.
మరిన్ని వివరాలకు 9533221189 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలియ చేశారు.
Prajavartha Online Telugu News