2K వాక్తాన్ ర్యాలీని ప్రారంభించిన నగర పోలీస్ కమీషనర్ ఎస్. వి రాజశేఖర్ బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ట్రాఫిక్ పోలీసులు మరియు Companionship మెంబర్స్ ఆద్వర్యంలో ఈ రోజు నూతన సంవత్సరం -2026 సంధర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మద్యం వద్దు- వేగం వద్దు – ప్రాణం ముద్దు అనే నినాధంతో ఇంధిరాగాంధి మున్సిపల్ స్టేడియం నుండి బెంజ్ సర్కిల్ వరకు 2 K వాక్తాన్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. పాల్గొన్నారు.

ఈ సంధర్భంగా నగర పోలీసు కమిషనర్  మాట్లాడుతూ… ముందుగా 2025 సం.రానికి వీడ్కోలు పలుకుతూ 2026 వ సంవత్సరం లోనికి అడుగు పెడుతున్నాము. ఈ సంవత్సరకాలంలో ఎన్.టి.ఆర్.పోలీసులు ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసు వారు చాలా అకుంటిత దీక్షతో పనిచేశారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించగలిగారు. 2024 లో 454 మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోయారు. 2025వ సం॥లో రోడ్డు ప్రమాద మరణాల 366 మంది దాదాపు 88 మందిని రక్షించగలిగాము. దీనికి ట్రాఫిక్ డి.సి.పి. గారిని మరియు వారి సిబ్బందికి ధన్యవాధాలు తెలియజేస్తున్నాను. 88 మంది ప్రాణాలు అంటే 88 కుటుంబాల జీవితాలు మనం కాపాడినవారము అవుతాము. ముఖ్యంగా హెల్మెట్ పై అవగాహన కల్పించడం వలన చాలా మంది ద్విచక్ర వాహనదారులు చిన్న చిన్న ప్రమాదాలతో బయటపడినారు. ఈ అవగాహన వలన 70 నుండి 80 శాతం మంది హెల్మెట్స్ లను వినియోగిస్తున్నారు. నెక్స్ట్ రోడ్డు ప్రమాద మరణాలు ఇంకా తగ్గించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా రోడ్డు సేఫ్టీ అనేధి ఒక ఉధ్యమంలాగా తీసుకుపోవాలి. వీటన్నిటి కంటే ముఖ్యంగా ప్రజలకు స్వీయ క్రమశిక్షణ అనేది ముఖ్యం అని తెలియజేశారు.

అనంతరం 2K వాక్తాన్ ర్యాలీని ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ తో పాటు ట్రాఫిక్ డి.సి.పి. షిరీన్ బేగం ఐ.పి.ఎస్., ట్రాఫిక్ ఏ.సి.పి.లు , ఇన్స్పెక్టర్ లు, Companionship మెంబర్స్, కళాశాల విధ్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *