-డూండి రాకేష్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా రాజకీయ కుట్రలు చేయడమే పనిగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో దాడికి గురైన ఆర్యవైశ్య యువకుడిని పరామర్శించాను. ఈ సంఘటన జరిగిన వెంటనే కూటమి ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా స్పందించి సంబంధిత ఎస్ఐని వీఆర్‌కు పంపడం అభినందనీయం. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని తక్షణ చర్యలు చేపట్టడం వల్ల ఆర్యవైశ్యలల్లో కూటమి ప్రభుత్వంపై మరింత విశ్వాసం పెరిగిందని తెలిపారు. ఆర్యవైశ్యుల భద్రతకు కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మరోసారి రుజువైంది.. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేయని వైసీపీ నేతలు ఈరోజు ఆర్యవైశ్యుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు. తమ స్వార్థ రాజకీయాల కోసం ఆర్యవైశ్యులను తాకట్టు పెట్టినవారే ఈరోజు వారి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. వైసీపీ పాలనలో ఒంగోలులో ఆర్యవైశ్య నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి, దానిని మొబైల్లో చిత్రీకరించినా కనీసం చర్యలు తీసుకోలేదని గుర్తు. అలాగే తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వార్డు సమస్యల చర్చ సందర్భంగా ఆర్యవైశ్య కౌన్సిలర్‌పై వైసీపీ కౌన్సిలర్లు దాడి చేసి గాయపరిచిన ఘటనలపై కూడా కేసులు నమోదు చేయలేదు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆర్యవైశ్యులపై జరిగిన అనేక దాడులపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అలాగే ‘జె-ట్యాక్స్’ విధించి ఆర్యవైశ్య వ్యాపారులను తీవ్రంగా దెబ్బతీశారు. ఆర్యవైశ్యలకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని, న్యాయం, భద్రత విషయంలో రాజీ పడేది లేదని డూండి రాకేష్ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News