ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకున్న గద్దె క్రాంతి కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని అశోక్ నగర్ చౌదరిపేటలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి గద్దె క్రాంతి కుమార్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పండితులు గద్దె క్రాంతికి వేదాశీర్వాదం, స్వామివారి ప్రసాదాలు అందజేశారు.

అనంతరం గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రతి దేవాలయం వద్ద ప్రభుత్వం పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారనే విషయానికి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతున్న పండుగలే నిదర్శనమని గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. ప్రజల సంప్రదాయాలు, విశ్వాసాలకు ప్రభుత్వాలు అండగా నిలవడం వల్లే రాష్ట్రంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొన్నదని ఆయన పేర్కొన్నారు. గద్దె క్రాంతి కుమార్ తో పాటు శాయన సత్యనారాయణ, మేదరమెట్ల నారాయణ తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *