Breaking News

కళాకారుల క్లస్టర్లు, ఎం.ఎస్.ఎం.ఇ ల బలోపేతమే లక్ష్యం – ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్

-టాటా స్ట్రైవ్ (Tata STRIVE) ప్రతినిధులతో మంత్రి కొండపల్లి సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ప్రముఖ కళాకారుల క్లస్టర్లకు చేయూతనివ్వాలని, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, తిరుపతి చెక్క శిల్పాల క్లస్టర్లు, కలంకారీ పెయింటింగ్, కడప మాధవరం హ్యాండ్లూమ్స్, శిల్పాలకు, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ తదితర రంగాలలో విలువ ఆధారిత మెరుగులు దిద్ది, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికార సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ టాటా స్ట్రైవ్ ప్రతినిధులకు సూచించారు. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME), స్వయం సహాయక సంఘాలు (SHG) మరియు కళాకారుల అభివృద్ధికి సంబంధించి ఎం.ఎస్.ఎం.ఇ, సెర్ప్ (SERP), ఎన్.ఆర్.ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం టాటా స్ట్రైవ్ (టాటా కమ్యూనిటీ ఇనిషియేటివ్స్ ట్రస్ట్) ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సాంప్రదాయ కళాకారుల క్లస్టర్ల బలోపేతం, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ, ఐటిఐ (ITI)ల ఆధునీకరణ, స్వయం సహాయక సంఘాలు (SHGs) మహిళలకు ఉత్పత్తుల ను పెంచటం కోసం నైపుణ్యశిక్షణ, బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పారిశ్రామిక క్లస్టర్లలో ఎం.ఎస్.ఎం.ఇ ల సామర్థ్యాన్ని పెంచేందుకు క్లస్టర్ డెవలప్మెంట్ విధానాన్ని అమలుచేయాలని, ప్రభుత్వ ఐటిఐలను డ్యూయల్ వెట్ (Dual VET) మోడల్ కింద అప్‌గ్రేడ్ చేసి, విద్యార్థులకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను మరియు ఇన్-ప్లాంట్ ట్రైనింగ్‌ను అందించాలని కోరారు. స్వయం సహాయక సంఘాలు (SHGs) మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు బ్రాండింగ్ మరియు మార్కెట్ లింకేజీలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని టాటా స్ట్రైవ్ బృందానికి మంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి, స్థానిక పరిస్థితులపై అధ్యయనం చేయాలని మంత్రి టాటా స్ట్రైవ్ బృందాన్ని కోరారు. క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ, సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను (Roadmap) సమర్పించాలని మంత్రి ఆదేశించారు. మన కళాకారుల నైపుణ్యం ప్రపంచ స్థాయికి చేరాలని, ప్యాకేజింగ్ మరియు బ్రాండింగ్‌లో ఆధునిక పద్ధతులను అవలంబించడం ద్వారా మన ఉత్పత్తులకు మంచి గిరాకీ లభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈదిశగా ప్రయత్నం చేసి ప్రపంచ స్థాయి గుర్తింపును సాధించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ టాటా స్ట్రైవ్ ప్రతినిధులను కోరారు. ఈ సమావేశంలో టాటా స్ట్రైవ్ పార్ట్నర్ హెడ్ రాజ్, టాలెంట్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ లీడ్ ఎం.ఎస్. బిజిత జాయిస్ తోపాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *