మహిళా పారిశ్రామిక శక్తికి పర్యావరణహిత దిశలో సీడీఐపీసీ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణలతో కొత్త జీవనోపాధి మార్గాలు

-తూర్పు గోదావరి జిల్లా నూతన ఆవిష్కరణలు కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించడమే లక్ష్యంగా తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం పర్యావరణహిత పారిశ్రామిక కార్యకలాపాలకు విస్తృత ప్రోత్సాహం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటన లో తెలియ చేశారు.

తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కేంద్ర జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కేంద్రం (CDIPC) ఏర్పాటు చేసి, మహిళా పారిశ్రామిక వేత్తల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ – సెర్ప్ పర్యవేక్షణ సీడీఐపీసీ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు, గ్రామీణ మహిళలకు నైపుణ్యాధారిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూన్నట్లు తెలిపారు.

ఉత్పత్తులు తయారు చేసే క్రమంలో పర్యావరణాన్ని కాపాడుతూ ఆదాయం పొందే అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా పర్యావరణహిత సువాసన కొవ్వొత్తులు, పాట్ పోట్పౌరీ వంటి విలువ జోడించిన ఉత్పత్తుల తయారీపై శిక్షణలు నిర్వహిస్తున్నారు. జనవరి 29 నుండి ఫిబ్రవరి 2, 2026 వరకు కడియం ఎంపిడీఓ కార్యాలయం మరియు కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), వెంకటరమన్నగూడెం కేంద్రాలలో ఈ శిక్షణ కార్యక్రమాలు బ్యాచ్‌ల వారీగా జరుగుతున్నాయనీ కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. ఇప్పటివరకు రెండు బ్యాచ్‌లలో 46 మంది మహిళలకు శిక్షణ అందించబడిందన్నారు. కృష్ణ్య బ్లిస్ సంస్థ సహకారంతో 100 శాతం సోయాబీన్ వెక్స్, సహజ సువాసన తైలాలు ఉపయోగించి పొగ రాని, ఆరోగ్యానికి హానికరం కాని సువాసన కొవ్వొత్తుల తయారీపై ప్రాక్టికల్ శిక్షణ అందిస్తున్నారు.

అదే విధంగా వైఎస్సార్ ఉద్యానవన విశ్వవిద్యాలయం సమన్వయంతో పాట్ పోట్పౌరీ ఉత్పత్తుల అభివృద్ధిపై శాస్త్రీయ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణలో పుష్ప వ్యర్థాలు, సేంద్రియ అవశేషాలను ఉపయోగించి విలువ జోడించిన ఉత్పత్తులు తయారు చేయడం, నాణ్యత నియంత్రణ, పర్యావరణహిత ప్యాకేజింగ్, బ్రాండింగ్, ధర నిర్ణయం, సూక్ష్మ స్థాయి పారిశ్రామిక మోడల్స్ వంటి అంశాలపై నిపుణుల మార్గదర్శకత్వం అందిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ – సెర్ప్ పర్యవేక్షణ లో ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి తయారీపై కూడా ఉద్యాన శాస్త్ర నిపుణులతో కలిసి అవగాహన, మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం జరుగుతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళల్లో పారిశ్రామిక ఆలోచన పెంపొందడమే కాకుండా, పర్యావరణహిత ఉత్పత్తులతో స్థిరమైన జీవనోపాధి సాధించే దిశగా కీలక అడుగులు పడుతున్నాయన్నారు. శిక్షణ పూర్తిచేసిన మహిళలకు సర్టిఫికెట్లు అందించి, భవిష్యత్తులో మార్కెట్ అనుసంధాన అవకాశాలు కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆసక్తి గల స్వయం సహాయక సంఘాల మహిళలు సీడీఐపీసీ, తూర్పు గోదావరి జిల్లా కార్యాలయాన్ని కార్యాలయ సమయాల్లో ఫోన్ నంబర్ : 9959440921 ను సంప్రదించవచ్చనీ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *