వెలంపల్లి ఫౌండేషన్ వారి సహకారంతో నిర్మించిన కళ్యాణమండపం ప్రారంభo…

-ఫ్రెజర్ పేట కొండ ప్రాంత ప్రజలకు అందుబాటులో కళ్యాణమండపం
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వెలంపల్లి ఫౌండేషన్ చైర్మన్ డా.సాయి ఆశ్విత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొండ ప్రాంతములో నివశించు పేద మద్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉంటేలా నిర్మించిన కళ్యాణ మండపమును వినియోగించుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం 55 & 56 డివిజన్ల పరిధిలోని ఎర్రకట్ట ప్రాంతములో రూ. 22 లక్షల వెలంపల్లి ఫౌండేషన్ వారి సహకారంతో నూతనంగా నిర్మించిన కళ్యాణమండపమును వెలంపల్లి ఫౌండేషన్ చైర్మన్ డా.సాయి ఆశ్విత, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కొండ ప్రాంతములో ఉంటున్న ఈ ప్రాంత ప్రజలకు చిన్న చిన్న కార్యక్రమములు నిర్వహించుకొనుటకు అందుబాటులో ఉండే విధంగా కళ్యాణమండపం నిర్మాణమునకు రూ.22 లక్షల వెలంపల్లి ఫౌండేషన్ అందించుట సంతోషకరమని అన్నారు. వెలంపల్లి ఫౌండేషన్ చైర్మన్ డా.సాయి ఆశ్విత కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కళ్యాణమండపం నందు త్రాగునీటి సౌకర్యం, మరుగు దొడ్ల నిర్మాణ వంటి పలు పనులకు నగరపాలక సంస్థ నిధుల నుండి 9 లక్షల రూపాయలు ఖర్చు చేయుటం జరిగిందని వివరించారు. స్థానికంగా ఉన్న వారందరూ ఈ కళ్యాణమండపాన్ని వినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమములో మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్, కార్పొరేటర్లు యలకల చలపతిరావు, శీరంశెట్టి పూర్ణచంద్రరావు, బుల్లా విజయకుమార్, చైతన్య రెడ్డి, మరుపిళ్ళ రాజేష్, కొ-ఆప్టేడ్ మెంబెర్ జమ్మల పూర్ణమ్మ తదితరులతో పాటుగా నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది, స్థానిక వై.ఎస్.ఆర్.సి.పి శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *