2వ విడత వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2వ విడత వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలలో భాగంగా శనివారం పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని 37, 50 మరియు 52వ డివిజన్లకు సంబందించి గాంధీజి మున్సిపల్ హైస్కూల్ నందు మరియు 38 & 44 డివిజన్లకు సంబందించి లేబర్ కాలనీ నగరపాలక సంస్థ కళ్యాణ మండపం నందు జరిగిన రెండోవ విడత ఆసరా సంబరాలలో రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ షేక్ ఆసిఫ్ తదితరులతో కలసి స్వయం సహాయక సంఘాల వారికీ చెక్కును అందజేసారు.

37వ డివిజన్ నందు 10 గ్రూప్ లకు రూ. 5,98,153/-, 50వ డివిజన్ నందు 152 గ్రూప్ లకు రూ. 1,28,83,887/-, 52వ డివిజన్ నందు 140 గ్రూప్ లకు రూ. 1,18,78,572/-, అదే విధంగా 38వ డివిజన్ నందు 109 గ్రూప్ లకు రూ. 60,38 ,905/, మరియు 44వ డివిజన్ నందు 149 గ్రూప్ లకు రూ. 72,12,968/- వెలసి మొత్తం 560 స్వయం సహాయక సంఘాల వారికీ రూ. 3,86,12,485/- చెక్కును అందించారు.

సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 58, 59 మరియు 60వ డివిజన్లకు సంబందించి అజిత్ సింగ్ నగర్, షాదిఖానా నందు ఏర్పాటు చేసిన వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలలో శాసన సభ్యులు మల్లాది విష్ణువర్ధన్, శాసన మండలి సభ్యురాలు షేక్ కరీమున్నిసా, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి సంబంధిత డివిజన్ కార్పొరేటర్లతో కలసి 58వ డివిజన్ నందు 236 గ్రూప్ లకు రూ. 2,11,24,057/-, 59వ డివిజన్ నందు 264 గ్రూప్ లకు రూ. 2,26,34,210/-, 60వ డివిజన్ నందు 191 గ్రూప్ లకు రూ. 1,59 ,47,119/- వెలసి మొత్తం 691 గ్రూపులకు రూ. 5,97,05,384/-రూపాయలు చెక్కును అందించుట జరిగింది.

అదే విధంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17 మరియు 18 డివిజన్లకు సంబందించి రాణిగారి తోట సిమెంట్ గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలలో తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్లతో కలసి 368 గ్రూపులకు రూ. 2,88,51,307/-రూపాయలు చెక్కును అందించుట జరిగింది.

కార్యక్రమంలో వై.సి.పి ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, స్థానిక కార్పొరేటర్లతో పాటుగా పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, సి,డి.ఓ లు దుర్గ ప్రసాద్, శ్రీనివాస్ మరియు యు.సి.డి క్షేత్ర స్థాయి సిబ్బంది, వైఎస్సార్ సీపీ శ్రేణులు, పొదుపు సంఘాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సీసీఎల్ఏలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్

-ఎస్సీలకు కలిగే ప్రయోజనాలను బుడగ జంగాలకూ వర్తింప చేయండి -ప్రణాళిక ప్రకారం కలెక్టర్లు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలి -కలెక్టర్ల సదస్సులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *