ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మరియు కమ్యూనిటి హాలు పూర్తి చేయుటకు చర్యలు చేపట్టాలి… : కమిషనర్ ప్రసన్న వెంకటేష్

-దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి చర్యలు – శాసన మండలి సభ్యురాలు షేక్ కరీమున్నిసా
-59వ డివిజన్లో పర్యటించిన శాసన మండలి సభ్యురాలు మరియు కమిషనర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఐ.ఏ.ఎస్ బుధవారం శాసన మండలి సభ్యురాలు షేక్ కరీమున్నిసా, 59వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ షహీనా సుల్తానా మరియు అధికారులతో కలసి సింగ్ నగర్, డాబా కోట్ల సెంటర్ తదితర ప్రాంతాలలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంలో గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపము, నిర్మాణ పనులు నిలిచిన కమ్యూనిటి హాలు ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. డివిజన్ పరిధిలోని పలు ప్రదేశాలలో పర్యటిస్తూ, అధికారులకు పలు సూచనలు చేసారు. గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపమునకు అవసరమైన మరమ్మతులు నిర్వహించుటకు తగిన అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా కళ్యాణ మండపం ప్రక్కన గల రైతు బజార్ వద్దన ఖాళిగా ఉన్న 4 షాపులలో సచివాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డివిజన్ నందు గతంలో ఎస్.టి. ఎస్.సి నిధులతో నిర్మాణ పనులు చేపట్టి పూర్తి కానీ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మరియు కమ్యూనిటి హాలును పరిశీలించి మిగిలిన పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఆ ప్రాంతములో గల ఖాళి స్థలమును పార్క్ గా అభివృద్ధి పరచుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె.శ్రీనివాస్, ఎస్టేట్ అధికారి డా.ఎ.శ్రీధర్ మరియు ఇతర అధికారులు, సిబ్బంది స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *