సి‌ఆర్డిఏ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్న యువత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (APCRDA) ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి & శిక్షణ శాఖ సౌజన్యంతో తుళ్లూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం జాబ్ మేళా జరిగింది. ఈ మేళాలో శివశక్తి ఎంటర్‌ప్రైజెస్, టెస్ట్2 బిల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్, నవత సప్లై చైన్ సొల్యూషన్స్, అపెక్స్ సొల్యూషన్స్ లిమిటెడ్, సింహా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, లైఫ్ సైన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్(LSSSDC), ఈజోన్ సెక్యూరిటీ సొల్యూషన్స్(I) ప్రైవేట్ లిమిటెడ్, SBI కార్డ్స్ కంపెనీలు పాల్గొన్నాయి. 325కి పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. జాబ్ మేళాకు 201 మంది అభ్యర్థులు హాజరు కాగా.. 45 మందికి ఉద్యోగాలు లభించాయి. మరొక 55 మంది తదుపరి రౌండ్లకు ఎంపికయ్యారు.

కార్యక్రమంలో APSSDC రాజధాని ప్రాంత ప్లేస్‌మెంట్ అధికారి డా. సిహెచ్. అరుణకుమారి, APCRDA సోషల్ డెవలప్మెంట్ విభాగ గ్రూప్ డైరెక్టర్ వి.రాములు, DCDO బొర్రా శ్రీనివాసరావు, సీనియర్ లైవ్‌లీహుడ్ ఆఫీసర్ శంకర్, జూనియర్ లైవ్‌లీహుడ్ స్పెషలిస్టులు వెంకటేశ్వర్లు, వరాహ నరసింహం, CRDA విలేజ్ ఫెసిలిటేటర్లు పాల్గొని జాబ్ మేళాను సమర్ధవంతంగా నిర్వహించారు. జాబ్ మేళాకు హాజరైన అభ్యర్ధుల సౌకర్యార్ధం సిబ్బందిని నియమించి రిజిస్ట్రేషన్, ఇంటర్వ్యూల నిర్వహణ ప్రక్రియను సాఫీగా నిర్వహించడం జరిగింది. ఉద్యోగాలకు ఎంపికైన పలువురు అభ్యర్థులకు అరుణకుమారి, CRDA అధికారులతో కలసి ఆఫర్ లెటర్లు అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *