Breaking News

మానికొండ – తరిగొప్పల రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు

-రూ. 2.5 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణం కానున్న మానికొండ – తరిగొప్పల రహదారి
-20 రోజుల్లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు ఎమ్మెల్యే ఆదేశం
-గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయని యార్లగడ్డ విమర్శ
-కూటమి ప్రభుత్వంపై విశ్వాసంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని వ్యాఖ్య

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యిందనీ ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గురువారం ఉంగుటూరు మండలం మానికొండ – తరిగొప్పల మధ్య అత్యంత అధ్వానంగా ఉన్న రహదారిని రూ. 2.5 కోట్ల వ్యయంతో పునర్నిర్మించే పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లే రాష్ట్రంలోని రహదారులు గుంతలమయంగా మారాయని ఆయన విమర్శించారు. కేవలం సంక్షేమ పథకాల ద్వారా నగదు బదిలీ చేస్తే సరిపోదని, మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తల్లో నమ్మకం పెరిగిందని, తద్వారా రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులతో ముందుకు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మానికొండ గ్రామ అభివృద్ధి కోసం మొత్తం రూ. 4.25 కోట్లు కేటాయించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఇందులో భాగంగా మానికొండ – తరిగొప్పల రోడ్డుతో పాటు, గుడివాడ వెళ్లే రహదారి మరమ్మతులకు రూ. 95 లక్షలు, ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 25 లక్షలు, అసంపూర్తిగా ఉన్న అంగన్‌వాడీ భవనానికి రూ.5 లక్షలు వెచ్చించనున్నట్లు వివరించారు. సోషల్ మీడియాలో ఈ రహదారి దుస్థితిపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని, కాంట్రాక్టర్ నిర్ణీత 20 రోజుల లోపు పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రతి సమస్య తనకు తెలుసని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రాధాన్యత క్రమంలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తున్నానని యార్లగడ్డ తెలిపారు. రానున్న ఒకటి రెండు నెలల్లో ఉపాధి హామీ పథకం (MGNREGS) నిధులతో గ్రామంలో సిమెంట్ రోడ్ల పనులు కూడా చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. జరుగుతున్న అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ఉంగుటూరు మండల ఎంపీడీవో సత్యకుమార్, గన్నవరం ఏయంసి చైర్మన్ గూడవల్లి నరసింహారావు, మండల టిడిపి అధ్యక్షులు కొలుసు రవీంద్ర, ఏయంసి డైరెక్టర్ కొండేటి వెంకటేశ్వరరావు, అరుమళ్ళ కృష్ణారెడ్డి, గొడ్డళ్ల రామారావు, కుందేటి చంద్రశేఖర్, గోగినేని విష్ణు, యడవల్లి సాయిబాబు, షేక్ వలి, షేక్ అజీజ్, షేక్ ఫిరోజ్, అరికట్ల రవికుమార్, బెజవాడ నాగేశ్వరరావు, మేడేపల్లి రమ, తుమ్మల లత, పొట్లూరి భువనేశ్వరి, దాసరి రవళి, చిమట రవివర్మ, బర్మా భాస్కర్, పోతినేని రామకృష్ణ, గరిమెళ్ళ వరప్రసాద్, పోతినేని బాపయ్య చౌదరి, చింతా వాసుబాబు, దోనేపూడి భరత్, పసుపులేటి సుబ్బారావు, తుమ్మల జగదీష్, అనిల్, అట్లూరి నాని, కొసరాజు సాయిరాం, గుండపనేని నాని, దొడ్ల కుమార్, నక్కా వెంకటేశ్వరరావు మరియు ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *