అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయకిలాద్రి దివ్య క్షేత్రంపై అంగరంగ వైభవంగా జరుగుచున్న హనుమజ్జయంతి ఉత్సవాలలో భాగంగా సోమవారం విజయకిలాద్రిపై వేంచేసి ఉన్నటువంటి దాసాంజనేయ స్వామి అభిషేక మహోత్సవం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎంతో వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమానికి తెలంగాణ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు విజయ కిలాద్రి దివ్య క్షేత్రం పైకి విచ్చేసి స్వామివారి మంగళ శాసనాలు అందుకున్నారు. కొండ పైన ఉన్నటువంటి అన్ని ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో విజయ కీలాద్రి దివ్య క్షేత్ర హనుమత్ విజయ యాత్ర మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడ రథం సెంటర్ నుంచి సీతానగరం విజయకిలాద్రి దివ్య క్షేత్రం వరకు ఎంతో వైభవంగా బైక్ మరియు కార్ ర్యాలీ ఎంతో కోలాహాలంగా, కన్నుల పండుగగా జరిగినది.. ఎంతోమంది భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News