గవర్నర్ ను కలిసిన టిటిడి ఛైర్మన్ సుబ్బారెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్ ను తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. మంగళవారం రాజ్ భవన్ కు వచ్చిన ఆయన గవర్నర్ కు స్వామి వారి ప్రసాదం, 2022 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్, డైరీలను బహుకరించారు. కరోనా నేపధ్యంలో భక్తుల సౌకర్యార్ధం చేపట్టిన చర్యలు, ప్రస్తుతం భక్తులను అనుమతిస్తున్న విధి విధానాలను గురించి గవర్నర్ కు సబ్బారెడ్డి వివరించారు. విపత్కర పరిస్ధితుల నేపధ్యంలో భక్తుల శ్రేయస్సు దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ సూచించారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *