పర్యావరణాన్ని కాపాడి… మత్స్య సంపదను పెంపొందించుకోవాలి… మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణాన్ని కాపాడడంతో పాటు మత్స్య సంపదను పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మచిలీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి ఎన్ ఎస్ కె ఖాజావలి అన్నారు.
ఆదివారం ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని స్థానిక జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో కృష్ణాజిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు షేక్ లాల్ మొహమ్మద్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన కృష్ణాజిల్లాలో 111 కిలోమీటర్లకు పైగా సముద్ర తీర ప్రాంతం ఉందని , 49 వేల హెక్టార్లలో మంచినీటి పెంపకం , 19 వేల హెక్టార్లలో ఉప్పునీటి చేపలు , రొయ్యలు తదితర మత్స్య సంపద అభివృద్ధి చేయడంలో వరుసగా రెండవసారి ఉత్తమ జిల్లా అవార్డు మం కృష్ణాజిల్లాకు రావడం ఎంతో హర్షణీయమన్నారు. అలాగే దేశంలో మన రాష్ట్రం అగ్రభాగంలో నిలిచిందన్నారు. పర్యావరణ అసమతుల్యత వల్ల జలవనరుల్లో మత్స్యసంపద తరిగిపోతున్నందున అందరికీ దీనిపై అవగాహన కల్పించి వారి సూచనలు, సలహాలతో మత్స్య సంపదను పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో యునైటెడ్ నేషన్స్ ఈనెల 21వ తేదీని ప్రపంచ మత్స్య దినోత్సవంగా గుర్తించిందన్నారు. ఈ మత్స్య దినోత్సవం 1998 సంవత్సరం నుండి జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచం జీవరాశికి ఆహారాన్ని సమకూర్చే ప్రధాన సంపదల్లో మత్య్స సంపద ఒకటని , ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకు అది మనకు ప్రధాన వనరుగానే ఉంటందని, నాటి నుంచి ఇప్పటి వరకు దాని ప్రధాన్యత తక్కకపోవడానికి కారణంగా అందులో ఉన్న పౌష్టికతేనని చెప్పాలని ఆర్డీవో ఖాజావలి అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏటా 10 కోట్ల మెట్రిక్ టన్నుల చేపలను ఆహారంగా వాడుతున్నారని వివరిస్తూ, చేపల వేటపై ఆధారపడి జీనాధారం సాగిస్తున్న వారి సంఖ్య 40 కోట్లకు పైబడే ఉంది. ప్రపపంచ వ్యాప్తంగా ఏడాదికి 9 వేల కోట్ల డారల్ల విలవువైన చేపల ఎగుమతి అవుతోందన్నారు. మత్స్యకారుల సంక్షేమం విషయంలో ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రాష్ట్రప్రభుత్వం మత్స్యకారులకు అందచేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలను మత్స్యకారులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అనంతరం కృష్ణాజిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు షేక్ లాల్ మొహమ్మద్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ఆక్వా పరిశ్రమ ఒక అక్షయ పాత్ర వంటిదని , మన రాష్ట్రంలో వ్యవసాయం, మత్స్య పరిశ్రమ మన ఆహారంలో అన్నం కూర వంటివని అభివర్ణించారు. కృష్ణాజిల్లా మత్స సహకార సొసైటీ అధ్యక్షులు చింతా గోవింద్ మాట్లాడుతూ, శాస్త్రవేత్తలకు , మత్స్యకారులకు మధ్య విజ్ఞాన సాంకేతికత విషయాలలో పరస్పర సహకారం ఎంతో అవసరం అన్నారు. తద్వారా మత్స్యకారుల ఆదాయ వనరులు పెంపొందించబడతాయన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు మోహనకుమార్, మచిలీపట్నం, అవనిగడ్డ , బంటుమిల్లి, గుడివాడ, కైకలూరు, విజయవాడ సహాయ సంచాలకులు వెంకటేశ్వరావు, ఎస్. సంజీవరావు, సాంబశివరావు, ఆర్. ప్రతిభ, చక్రాణీ, జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *