-సంస్మరణ సభలో పలువురి నాయకుల శ్రద్ధాంజలి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సిపిఐ నగర సీనియర్ నాయకులు , కార్మిక నేత, ముఠా కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు కామ్రేడ్ వియ్యపు నాగేశ్వరరావు మృతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనీ లోటు అని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో తొలుత పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ వియ్యపు నాగేశ్వరరావు లాంటి నిబద్ధత కలిగిన పార్టీ నేత, కార్మిక నేత భౌతికంగా దూరం అవ్వడం కమ్యూనిస్టు ఉద్యమానికే కాకుండా ముఖ్యంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న కార్మికవర్గానికి తీరని లోటు అని అంటూ ఆయనకు నాగేశ్వరరావు గారితో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ కామ్రేడ్ వియ్యపు నాగేశ్వరరావు యువజన సమాఖ్య కార్యకర్తగా తన రాజకీయ ప్రయాణం ప్రారంభించి అకుంఠిత దీక్ష, దక్షలతో ఆతికాలంలోనే నగర యువజన సమాఖ్య కార్యదర్శిగా, పార్టీ నగర కార్యవర్గ సభ్యునిగా, ఏఐటీయూసీ నగర కార్యదర్శిగా సమర్థవతంగా తన బాధ్యతలను నిర్వర్తించి ఆయా సంఘాల బలోపేతానికి విశేష కృషి చేస్తూ పార్టీ ఎటువంటి బాధ్యతలను అప్పగిచించిన దానిని తూచా తప్పకుండా పాటిస్తూ పార్టీ కార్యక్రమాలు విజయవంతంగా చేసేందుకు తనదైన చురుకైన పాత్ర పోషించేవారేనని అని అన్నారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ మాట్లాడుతూ తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి అనునిత్యం పేదప్రజల సమస్యల పరిష్కారంలో కోసం అనేక ప్రజా పోరాటాలలో, ముఖ్యంగా కార్మిక నాయకునిగా, ముఠా కార్మిక సంఘ గౌరవాధ్యక్షునిగా ముఠా కార్మికుల సమస్యలు, వారి సంసక్షేమానికి ఎళ్లవేళల వారికీ అందుబాటులో ఉంటు వారి సమస్యలపట్ల అనేక ఉద్యమాలు రూపకల్పన చేసి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించడంలో తనదైన చెరగని ముద్ర వేశారు. తన తుది శ్వాసవరకు తాను నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకు నిలిచినా నిబద్దత కల్గిన కమ్యూనిస్టు కార్యకర్తలలో ముందువరసలో ఉండే వై కామ్రేడ్ నాగేశ్వరరావు గారు అని కొనియాడారు. కామ్రేడ్ నాగేశ్వరరావు గారిని స్ఫూర్తిగా తీసుకోని రానున్న కాలంలో మరింత మంది అయన అడుగుజాడలలో నడుస్తూ ప్రజా సమస్యలపట్ల మరియు పార్టీ బోలోపేతానికి విశేష కృషి చేయాలని పిలుపునిచ్చారు.
. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి నగర అధ్యక్ష,కార్యదర్శులు కె. ఆర్. ఆంజనేయులు, మూలి సాంబశివరావు, సిపిఐ క్రిష్ణ జిల్లా కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, సిపీఎం నాయకులు సిహెచ్.బాబూరావు, టిడిపి నాయకులు బొప్పన భావకుమార్, నవనీతం సాంబశివరావు, నగర పార్టీ సహాయ కార్యదర్శిలు లంక దుర్గారావు, నక్క వీరభద్రరావు, స్థానిక మాజీ కార్పొరేటర్ ఇజ్జాడ లక్ష్మీ, గార్లు పాల్గొని ప్రసంగించారు, ముందుగా నగర పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు అపరబోతు రాము వక్తలను వేదిక పైకి ఆహ్వానించారు, డివిజన్ పార్టీ కార్యదర్శి పడాల కనకారావు, వందన సమర్పణ చేశారు, డివిజన్ పార్టీ సహాయ కార్యదర్శులు ఏ అసిరి నాయుడు, కొండలరావు, ఏఐవైఎఫ్ నాయకులు లాల్ మోహన్, పలువురు నగర, స్థానిక పార్టీ,నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News