విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ఆదివారం చదవటం మాకిష్టం కార్యక్రమంలో ఈరోజు మృదుల, మిధుల పుట్టినరోజు శనివారం నాడు జరిగింది. ఈ చిన్నారులు ఈరోజు చదవటం మాకిష్టం కార్యక్రమానికి వచ్చి పుట్టినరోజు వేడుకలు వాళ్ల తల్లిదండ్రులు వోరుగంటి వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారు , పద్మజ మరియు అక్క లాస్య తో ఘనంగా చేసుకున్నారు. ఈ చిన్నారులు వాళ్లకు కానుకగా పెద్దలు ఇచ్చిన నగదును ఈరోజు 10 మంది విద్యార్థులకు 50 రూపాయలు చొప్పున శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. అంతేకాక తెలుగు కాపీ రైటింగ్ పుస్తకాలను కూడా ప్రతి ఆదివారం ఉపయోగించుకోవాలని 25 మందికి బహుకరించారు. గ్రంథాలయ అధికారి కే రమాదేవి మాట్లాడుతూ చిన్న వయసులోనే సేవాభావం, దాతృత్వం అలవర్చుకోవటం సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. పుట్టినరోజు కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలలో జరుపుకోవడం ద్వారా ఇతర చిన్నారులకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. చిన్నారుల తల్లిదండ్రులు వోరుగంటి వీర వెంకట సత్యనారాయణ మూర్తి మరియు పద్మజా ఇద్దరినీ గ్రంథాలయాధికారి రమాదేవి అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నoదుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. రమాదేవి మరియు చిన్నారులు అందరూ మృదుల, మిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వివిధ స్కూల్స్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News