Breaking News

ఆడి నెల మొదటి ఆదివారం సందర్భంగా దేశమ్మ గుడి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా

నగరి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆడి నెల మొదటి ఆదివారం సందర్భంగా నగరి పట్టణంలోని దేశమ్మ గుడి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి, నగరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఆర్కే రోజా భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని అమ్మవారిని ప్రార్థించారు. ఆలయ అర్చకులు రోజా కి వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *