విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని “సుజన ఫౌండేషన్” ద్వారా రెండో రోజు, ఆదివారం కుమ్మరి పాలెం సెంటర్, లోటస్ అపార్ట్మెంట్స్ దగ్గర నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి శని, ఆదివారలలో ఉచిత మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు, జనరల్ ఫిజీషియన్ వైద్య సేవలతో పాటు బీ పీ, షుగర్, ఈ సీ జీ, 2డి ఎకో, ఎక్స్ రే, మరియు రక్త పరీక్షలు, ఉచితంగా చేస్తున్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేద ,మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పం తో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఈ శిబిరాలను నిర్వహిస్తున్నారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ శిబిరంలో 86 మందికి నిపుణులైన వైద్యుల బృందం ప్రత్యేక శ్రద్ధతో చికిత్సలు అందించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. సుజన ఫౌండేషన్ సిబ్బంది, సుజన మిత్రా కోఆర్డినేటర్లు ఈ శిబిరంలో తమ సేవలందించారు.
Prajavartha Online Telugu News