Breaking News

బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే యార్లగడ్డ

-శ్రీ గాయత్రి అమ్మవారి ఆషాఢ సారే మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే
-బ్రాహ్మణ కళ్యాణ మండపం నిర్మాణానికి అనువైన స్థలం గుర్తించాలని ఎంఆర్ఓకు ఆదేశం
-త్వరలో కళ్యాణ మండపం నిర్మాణ ప్రక్రియ ప్రారంభిస్తానని హామీ

గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నియోజకవర్గంలోని బ్రాహ్మణుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఏపీ ప్రభుత్వ విప్‌, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. గన్నవరం సొసైటీపేటలో శ్రీ గాయత్రి అమ్మవారి దేవస్థానం కమిటీ, గన్నవరం బ్రాహ్మణ పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఆషాఢ మాస కార్యక్రమం, బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలోని బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధి కోసం రూ.20.50 లక్షల రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. బీమా పథకం ప్రతి కుటుంబానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రూ.600 సభ్యత్వంతో సహజ మరణానికి రూ.50 వేల ఆర్థిక సాయం, ప్రమాద బీమా ప్రయోజనాలు లభిస్తాయని వివరించారు. సభ్యత్వ రుసుము చెల్లించలేని నిరుపేదలకు తానే స్వయంగా ఆ మొత్తం చెల్లిస్తానని హామీ ఇచ్చారు. బ్రాహ్మణ సమాజం కోరిన కళ్యాణ మండపం నిర్మాణానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అనువైన స్థలాన్ని పరిశీలించాలని ఎంఆర్ఓను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలోనే ఈ అంశంపై చర్యలు ప్రారంభిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా సమాజానికి అండగా నిలుస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని రుణాలు నియోజకవర్గానికి వచ్చేలా కృషి చేస్తానన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సహకారంతో మరింత లబ్ధి చేకూరేలా ప్రయత్నిస్తానని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే శ్రీ గాయత్రి అమ్మవారికి నిర్వహించిన ఆషాఢ సారే మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పి.వి ఫణికుమార్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం (బోస్), గన్నవరం గ్రామ టిడిపి అధ్యక్షులు జాస్తి శ్రీధర్, గన్నవరం బ్రాహ్మణ పరిషత్, గాయత్రి మందిర పరిషత్ చైర్మన్ కె.వి.ఆర్ కిషోర్, ఆలయ కమిటీ కార్యదర్శి ఎస్.వి.జి కృష్ణ, కమిటీ ట్రెజరర్ ఎస్. రవికుమార్, కూటమి నాయకులు జాస్తి మురళి, మోదుగుమూడి సత్యనారాయణ, మద్దినేని వెంకటేశ్వరరావు, చిమటా రవివర్మ, బుస్సే నాగప్రసాద్, చల్లగుల్ల సందీప్, కొసరాజు సాయిరాం, బుస్సే సరిత, ఆళ్ల దమయంతి, దేవినేని సులోచన, జాస్తి తాతారావు, నసరత్ బేగం, కంచర్ల సూర్యప్రకాష్, కంభంపాటి దత్త సాయిరాం మరియు అమ్మవారి భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *