-డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. ఏ. విష్ణు వర్థన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ బోర్డు ఆధ్వర్యంలో రాష్ట్రంలోని జీఎన్‌ఎం (General Nursing and Midwifery Examinations September – 2026- GNM) విద్యార్థుల కోసం సెప్టెంబర్-2026 లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్య విద్యా సంచాలకులు డా. ఎ. విష్ణు వర్ధన్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.
సప్లిమెంటరీ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ పరీక్షలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కళాశాలల ప్రిన్సిపాళ్ల ద్వారా పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. పరీక్షల షెడ్యూల్, పరీక్ష ఫీజు తదితర పూర్తి వివరాలు వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం అధికారిక వెబ్‌సైట్ https://dme.ap.nic.in లో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. ఏ విష్ణువర్ధన్ ఆ ప్రకటనలో కోరారు.
Prajavartha Online Telugu News