Breaking News

పిజిఆర్ఎస్‌కు విశేష స్పందన

-187 వినతులు స్వీకరణ, వినతుల పరిష్కారంలో ఆలస్యం సహించేది లేదు
-పెండింగ్ అర్జీలను వెంటనే డిస్పోజ్ చేయాలి
-రైతులకు ఎరువుల సరఫరాపై ప్రత్యేక పర్యవేక్షణ – స్పెషల్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలి
-ఎన్టీఆర్ జిల్లాకు పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి
-జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)’ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలపై వినతిపత్రాలు, ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 187 వినతులు అందగా, వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు చెందిన 51 వినతులు నమోదయ్యాయి. అలాగే ఎం ఏ యు డి – 32, పోలీస్ -25, పంచాయతీరాజ్ – 18 వినతులు నమోదు కాగా, మిగిలిన శాఖలకు సంబంధించి ఏడు నుండి ఒకటి వరకు వినతులు నమోదు కావడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని నిర్దేశిత గడువులోగా పూర్తిస్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న వినతులను వెంటనే పరిశీలించి పరిష్కరించిన అనంతరం ఆన్‌లైన్‌లో డిస్పోజ్ చేయాలని స్పష్టం చేశారు. పిజిఆర్ఎస్ వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం లేదా ఆలస్యం సహించేది లేదని హెచ్చరించారు. అధికారులు పిజిఆర్ఎస్ పోర్టల్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, పెండింగ్‌లో ఉన్న వినతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా రెవెన్యూ, భూ వివాదాలు, సర్వే సమస్యలు వంటి ప్రజలకు నేరుగా సంబంధించిన అంశాలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి గ్రీవెన్స్ నిర్దేశిత సమయపరిమితిలో పూర్తి కావడంతో పాటు, అర్జీదారునికి సంతృప్తికరమైన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మండలాల వారీగా నియమించబడిన స్పెషల్ అధికారులు ఆయా మండలాలను సందర్శించి ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు, ప్రతికూల నివేదికలు రాకుండా చూడాలని, అవసరమైన ప్రతి రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. పరిశ్రమలు స్థాపించాలనుకునే పారిశ్రామికవేత్తలకు జిల్లా పరిశ్రమల సమావేశం సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయించి, అనంతరం భూమి కేటాయింపునకు అవసరమైన దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియపై పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదేనని పేర్కొంటూ, బుధవారం మధ్యాహ్నానికల్లా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, పెట్టుబడిదారుల్లో ఇంకా కొంత సందిగ్ధత నెలకొని ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎంఎస్‌ఎంఈ సమావేశంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు ఎక్కడ సంప్రదించాలి, ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై సందేహాలు వ్యక్తం చేశారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాకు మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు ఆకర్షించాలంటే సంబంధిత అధికారులందరికీ పెట్టుబడుల ప్రక్రియపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారిని, స్టార్టప్ వ్యవస్థాపకులను ప్రోత్సహించాలని, వారిని జీఎం-డీఐసీ లేదా సంబంధిత ఇన్వెస్ట్‌మెంట్ డెస్క్ అధికారులతో అనుసంధానించాలని ఆదేశించారు. పరిశ్రమలకు అందుబాటులో ఉన్న లేఅవుట్లు, ప్లాట్లు, భూముల వివరాలు ఎప్పటికప్పుడు ఏపీఐఐసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో పెట్టుబడుల పురోగతిపై ప్రతి వారం ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంతమంది పెట్టుబడిదారులు సంప్రదించారు, వారి అవసరాలు ఏమిటి, ఏ దశలో ప్రతిపాదనలు ఉన్నాయనే వివరాలను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. విశాఖపట్నంలో కుదిరిన ఎంఓయూల ద్వారా ఎన్టీఆర్ జిల్లాకు పలు పరిశ్రమలు, టూరిజం ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని, వాటికి అవసరమైన అనుమతులను వేగంగా జారీ చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అందుతున్న ఫిర్యాదులపై అధికారులు అత్యంత బాధ్యతతో స్పందించాలని కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత అధికారులు అర్జీదారులను స్వయంగా సంప్రదించి, వారి సమస్యలను తెలుసుకున్న అనంతరమే ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని సూచించారు. అర్జీదారునితో మాట్లాడిన తేదీ, సమయాన్ని కూడా నివేదికలో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. 1100 టోల్ ఫ్రీ సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, ఆ నంబర్‌కు వచ్చే ప్రతి కాల్‌కు సంబంధిత అధికారులు సరైన విధంగా స్పందించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీనరసింహ, పీజీఆర్ఎస్ జిల్లా నోడల్ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *