Breaking News

పీజీఆర్ఎస్‌కు వచ్చే ప్రజల కోసం కలెక్టరేట్‌లో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

-సుమారు 130 మందికి ఉచిత వైద్య సేవలు, మందుల పంపిణీ
-ఆయుర్వేదం ద్వారా తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు
-జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. శిబిరంలో ప్రజలకు అందిస్తున్న చికిత్సలు, మందుల పంపిణీ, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏహెచ్‌ఐఎంఎస్ (AHIMS) యాప్ ద్వారా ఇప్పటివరకు ఎంతమంది రోగులు నమోదు చేసుకున్నారో సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో డిజిటల్ విధానాలను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ మాట్లాడుతూ, ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అర్జీదారుల కోసం ప్రత్యేకంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రజలు తమ పనులతో పాటు ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించడం ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంపొందుతుందని పేర్కొన్నారు. ఆయుర్వేదం భారతదేశానికి చెందిన ప్రాచీన వైద్య విధానమని, జీవనశైలి సంబంధిత వ్యాధుల నివారణలో, దీర్ఘకాలిక ఆరోగ్య సంరక్షణలో దీనికి విశేష ప్రాధాన్యత ఉందన్నారు. తక్కువ ఖర్చుతో దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆయుర్వేద వైద్యాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైద్య అధికారులకు సూచించారు. ఆయుర్వేద వైద్యం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో రక్తపోటు (బీపీ), మధుమేహం (షుగర్), చర్మవ్యాధులు, దగ్గు, రొంప, మోకాళ్ల నొప్పులు, కీళ్ల సంబంధిత వ్యాధులు తదితర ఆరోగ్య సమస్యలకు వైద్యులు పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఆయుర్వేద మందులను ఉచితంగా పంపిణీ చేశారు. రోగులకు ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు, ఆయుర్వేద చికిత్స విధానాలపై కూడా వైద్యులు సూచనలు అందించారు. ఈ శిబిరంలో సుమారు 130 మంది ప్రజలు వైద్య సేవలను పొందగా, ఉచితంగా మందులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ వై.రత్న ప్రియదర్శిని, వైద్యులు డాక్టర్ విష్ణువర్ధన్, డాక్టర్ మహమ్మద్ జుమీద్, వైద్య సిబ్బంది మరియు ఆయుష్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *