Breaking News

వర్షపు నీరు నిల్వ కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ ఏ. రవీంద్రరావు, అడిషనల్ కమిషనర్ ఎస్ డి ఎస్ డబ్ల్యు కే శకుంతల గురువారం సాయంత్రం నగరంలో వర్షాల నేపథ్యంలో నీరు నిలిచే అవకాశం ఉన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారితో కలిసి బెంజ్ సర్కిల్ నుంచి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో బ్రిడ్జి వరకు పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా ఇన్‌చార్జి కమిషనర్ మాట్లాడుతూ, ఎక్కడా వర్షపు నీరు నిల్వ కాకుండా డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అవసరమైన చోట వెంటనే డీ-వాటరింగ్ పంపులను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన రహదారులపై నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఫీల్డ్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు.

అదనపు కమిషనర్ (ఎస్‌జి‌ఎస్‌డబ్ల్యూ) కే. శకుంతల సర్కిల్-3 పరిధిలో వర్షపు నీటి నిలువ ఉండే ప్రాంతాలను పరిశీలించి, నీరు నిల్వ కాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన యంత్రాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ పర్యటనలో ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పారిశుద్ధ్య విభాగాల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఉత్తరాంధ్రకు మకుటాయమానం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం: మంత్రి కందుల దుర్గేష్

-ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ ప్రారంభోత్సవం.. ఈ సందర్భంగా ఏర్పాట్లను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *