Breaking News

రాష్ట్రంలోనే తొలి ఉచిత 2డీ ఎకో స్కానింగ్ కేంద్రం ఏర్పాటు..

-తల్లి, బిడ్డ ఆరోగ్య సంరక్షణకు కీలక అడుగు
-లాంఛనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
-550 మంది గర్భిణీలకు ఉచిత అత్యాధునిక గుండె పరీక్షలు
-ముందస్తు గుర్తింపుతో మాతా,శిశు మరణాల నివారణే లక్ష్యంగా పశ్చిమ ప్రజా ఆరోగ్య రంగంలో రాష్ట్రానికి ఆదర్శం..
-ఆదర్శ నియోజకవర్గంగా పశ్చిమ..
-రాజకీయాలకు అతీతంగా సేవలు..
-డిమాండ్ చేసి పనులు చేపించుకోండి..
-ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గర్భిణీ స్త్రీలు, గర్భస్థ శిశువుల ఆరోగ్య సంరక్షణలో మరో వినూత్న అడుగు పడింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా) చౌదరి నాయకత్వంలో”సుజనా ఫౌండేషన్” ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా గర్భిణీల కోసం ఉచిత 2డీ ఎకో స్కానింగ్ కేంద్రం ప్రారంభమైంది. గర్భిణీలకు అత్యాధునిక వైద్య పరీక్షలను పూర్తిగా ఉచితంగా అందుబాటులోకి తీసుకువస్తూ ప్రారంభించిన ఈ సేవలు మాతా,శిశు ఆరోగ్య రక్షణలో కీలక మైలురాయిగా నిలవనున్నాయి.

గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగకరం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ, గర్భధారణ అనేది వ్యాధి కాదని, అయితే గర్భధారణ సమయంలో తల్లి, గర్భస్థ శిశువులో ఏర్పడే గుండె సంబంధిత లోపాలు, ఇతర ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం అత్యంత అవసరమని చెప్పారు. అందుకే 2డీ ఎకో స్కానింగ్ సేవలను ప్రతి గర్భిణీకి ఉచితంగా అందించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమైన రోజునే ఈ సేవలను ప్రారంభించడం మరింత సంతోషంగా ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రస్తుతం గుర్తించిన సుమారు 550 మంది గర్భిణీలకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు.

గర్భిణీల్లో వచ్చే గుండె స్పందనలో మార్పులు, పుట్టబోయే శిశువులో గుండె సంబంధిత లోపాలను ముందుగానే గుర్తించడం ద్వారా అవసరమైన వైద్య చికిత్స, జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యవంతమైన ప్రసవాలకు మార్గం సుగమం అవుతుందని వివరించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆనందంగా ఉంటుందని, అదే సమాజాభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు పూర్తవుతున్నప్పటికీ ప్రతి గర్భిణీకి ఇలాంటి కీలక వైద్య పరీక్షలు అందుబాటులో లేకపోవడం బాధాకరమని సుజనా చౌదరి అన్నారు.

విద్య, వైద్యం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతలేనని, అయితే ప్రభుత్వానికి తోడుగా సేవా సంస్థలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అదే సామాజిక బాధ్యతతో సుజన ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, ఎన్నికల అనంతరం ప్రజాప్రతినిధి ప్రతి ఒక్కరికీ సమానంగా సేవ చేయాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. ఓటు వేశారా లేదా, ఏ పార్టీకి చెందిన వారైనా, ధనిక–పేద అనే తేడా లేకుండా ప్రతి గర్భిణీ ఈ ఉచిత సేవలను వినియోగించుకోవాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గాన్ని ప్రజా ఆరోగ్యం, సంక్షేమం, వినూత్న సేవల్లో రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

జిల్లాలో కూడా విస్తరించండి..
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ, ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉండే 2డీ ఎకో స్కానింగ్ సేవలను ఉచితంగా ప్రజలకు అందించడం అభినందనీయమన్నారు. గర్భస్థ శిశువులో లోపాలను ముందుగానే గుర్తించి మాతా,శిశు మరణాల తగ్గింపులో ఈ సేవలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
ఈ నమూనాను జిల్లాలోని ఇతర నియోజకవర్గాలకు, గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించేలా సుజన ఫౌండేషన్ సహకరించాలని కోరారు.

ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు అవసరమైన గర్భిణీలను గుర్తించి ఈ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

పశ్చిమంలో పారదర్శక పాలన అందిస్తూ, అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో అమలు చేస్తూ ఎమ్మెల్యే సుజనా చౌదరి రోల్ మోడల్ గా నిలిచారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు , పశ్చిమ ఇన్చార్జ్ బుద్ధా వెంకన్న అన్నారు.

ప్రజా ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, మహిళలు, గర్భిణీలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్న ఎమ్మెల్యే సుజనా సేవా తత్పరుడని కొనియాడారు..

ప్రజారోగ్యమే లక్ష్యంగా “సుజనా ఫౌండేషన్” అందిస్తున్న వైద్య సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బుద్ధా వెంకన్న తెలిపారు..

ఈ కార్యక్రమంలో డి ఏం హెచ్ ఓ శ్రావణ్, ఏపీ నూర్ భాషా దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, ఏపీ నాగవంశం సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, ఉమ్మడి కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆషా, జనసేన సీనియర్ నాయకులు అమ్మిశెట్టి వాసు, బాడిత శంకర్, తిరుపతి అనూష,టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, కోగంటి రామారావు, బీజేపీ నాయకులు పోతిన భేసు కంటేశ్వరుడు, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు,దుర్గమ్మ మాజీ కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మహ్మద్ అబ్దుల్ ఖాదర్, సుజనా ఫౌండేషన్ సీ ఈ ఓ సుధా ఉపాధ్యాయుల, గైనకాలజిస్ట్ డాక్టర్ దుర్గా శ్రీలక్ష్మి కూటమినేతలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *